యాప్నగరం

'ముస్లింలు ఆ పని చేస్తే... రామమందిరం సాధ్యమే'

అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై నెలకొన్న వివాదంపై 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్.. సలహా ఇచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికిగాను స్థలాన్ని... ముస్లింలు కానుకగా ఇవ్వాలని ఆయన సూచించారు.

TNN 14 Mar 2018, 6:31 pm
అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై నెలకొన్న వివాదంపై 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్.. సలహా ఇచ్చారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికిగాను స్థలాన్ని... ముస్లింలు కానుకగా ఇవ్వాలని ఆయన సూచించారు. వివాదాస్పద స్థలంలో... రామమందిరం నిర్మించాలని ఓ వర్గం, మసీదు నిర్మించాలని మరో వర్గం డిమాండ్ చేస్తున్నాయి. అయితే... అయోధ్యలోని వివాదాస్పద స్థలం విషయంలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య సయోధ్యకు రవిశంకర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతోంది.
Samayam Telugu muslims give babri land for ram temple
'ముస్లింలు ఆ పని చేస్తే... రామమందిరం సాధ్యమే'


రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదానికి సంబంధించి... కోర్టు బయటే చక్కని పరిష్కారం సాధ్యమవుతుందని రవిశంకర్ అన్నారు. రామాలయ నిర్మాణానికిగాను స్థలాన్ని ముస్లింలు హిందువులకు కానుకగా ఇవ్వడాన్ని పరిష్కారంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక వర్గానికి అనుకూలంగా వస్తే... మరోవర్గం నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవడం ఖాయమని... కోర్టు వెలుపలే దీనికి పరిష్కారం దొరుకుతుందని ఆయన అభిప్రాయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.