యాప్నగరం

ముస్లింలు మాంసం మానేయండి.. అదో విషం

రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) ఉండే ముస్లింలు మాంసాహారాన్ని మానేయాలన్ని ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు

Samayam Telugu 6 Jun 2017, 11:46 am
రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) ఉండే ముస్లింలు మాంసాహారాన్ని మానేయాలన్ని ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మాంసాహారం తింటే రోగాలు వస్తాయని.. అది విషంతో సమానమని ఆయన అన్నారు.
Samayam Telugu muslims should not eat meat during ramadan advises rss leader indresh kumar
ముస్లింలు మాంసం మానేయండి.. అదో విషం


‘రంజాన్ మాసంలో ముస్లింలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి. వాళ్ల ఇళ్ల వద్ద, వీధుల్లో, మసీదుల్లో, దర్గాలలో చెట్లు నాటాలి. ఇంట్లో తులసి మొక్కలు నాటుకోవాలి. అది ఇంటిల్లిపాదికి ఎంతో మంచిది’ అని ఇంద్రేశ్ కుమార్ సూచించారు.
అంతేకాదు షర్బత్ లో పాలు కూడా కలపాలని సూచించారు. ‘మహ్మాద్ ప్రవక్త ఏనాడు మాంసం ముట్టలేదు. ఆయన మాంసం రోగం అని, పాలు రోగ నివారిణి అని చెబుతుండేవారు’ అని ఇంద్రేశ్.. సోమవారం ఢిల్లీలోని జమై మిలియా యూనివర్సిటీలో జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

పవిత్ర రంజాన్ లో మాంసం తినడం అంటే విషాన్ని సేవించడంతో సమానమని ఆయన హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.