యాప్నగరం

ఆయనొచ్చారని.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టిన మోదీ

పదిహేనేళ్ల తర్వాత ఓ ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి భారత పర్యటనకు వచ్చారు. అంతకు ముందు కూడా ఒకే ఒక్క ఇజ్రాయిల్ ప్రధాని భారత్‌లో పర్యటించారు.

TNN 14 Jan 2018, 2:42 pm
పదిహేనేళ్ల తర్వాత ఓ ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి భారత పర్యటనకు వచ్చారు. అంతకు ముందు కూడా ఒకే ఒక్క ఇజ్రాయిల్ ప్రధాని భారత్‌లో పర్యటించారు. కిందటేడాది మన ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు ఏ ఒక్క భారత ప్రధాని ఇజ్రాయిల్‌లో పర్యటించలేదు. దీంతో మోదీ ఇజ్రాయిల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీకి ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకడం దగ్గర నుంచి పర్యటన ముగిసేంత వరకు ఆయనకు అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చింది ఆ దేశం. మోదీకి రెడ్‌కార్పెట్ వేయడంలో ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మోదీ మనసు గెలిచారు. ఇప్పుడు ఆయన.. తన సతీమణితో కలసి భారత పర్యటనకు వచ్చారు. మరి మోదీ ఆతిథ్యం మామూలుగా ఉంటుందా..?
Samayam Telugu narendra modi breaks protocol receives israel pm netanyahu at airport
ఆయనొచ్చారని.. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టిన మోదీ


అందుకే ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి తానే స్వయంగా విమానాశ్రయానికి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన నెతన్యాహు దంపతులకు ఆత్మీయ స్వాగతం పలికారు. నెతన్యాహు, ఆయన భార్య సారా భారత్‌లో ఆరు రోజులపాటు పర్యటించనున్నారు. నెతన్యాహుకు స్వాగతం పలుకుతూ మోదీ ఓ ట్వీట్ కూడా చేశారు. ‘ భారత్‌కు వచ్చిన నా మిత్రుడు ప్రధాని నెతన్యాహుకు స్వాగతం. మీ భారత పర్యటన చరిత్రాత్మకం, ప్రత్యేకం. మన ఇరు దేశాల మధ్య మైత్రికి ఈ పర్యటన మరింత బలం చేకూరుస్తుంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Welcome to India, my friend PM @netanyahu! Your visit to India is historic and special. It will further cement the close friendship between our nations. @IsraeliPM #ShalomNamaste pic.twitter.com/sidgMmA1fu — Narendra Modi (@narendramodi) January 14, 2018
ఇదిలా ఉంటే.. ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి దేశాధినేతలకు స్వాగతం పలకడం మోదీకి ఇది తొలిసారి కాదు. గతేడాది సెప్టెంబరులో గుజరాత్‌ పర్యటనకు వచ్చిన జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబేకి స్వాగతం పలికేందుకు కూడా మోదీ ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి విమానశ్రయానికి వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికి దగ్గరుండి తీసుకొచ్చారు. కాగా, ప్రస్తుతం భారత్‌కు వచ్చిన నెతన్యాహుతో కలిసి మోదీ.. ఢిల్లీలోని తీన్‌ మూర్తి చౌక్‌లో జరగనున్న కార్యక్రమానికి హాజరు కానున్నారు. తీన్‌ మూర్తి చౌక్‌ పేరును తీన్‌ మూర్తి హైఫా చౌక్‌గా మార్చనున్నారు. హైఫా అనేది ఇజ్రాయిల్‌లోని ఓ సిటీ పేరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.