యాప్నగరం

మన చేనేతకు పునర్వైభవం వచ్చేనా!

‘రాట్నంపై నేసిన ప్రతి దారంలోనూ నేను భగవంతుణ్ని చూశాను’- మహాత్మా గాంధీ

TNN 7 Aug 2016, 2:42 pm
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన భారతీయ చేనేత రంగం నేడు ప్రాభవం కోల్పోయింది. చేనేత రంగానికి పునర్వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో ఏటా ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు ఘనమైన చరిత్రే ఉంది. అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రలోనూ వేలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం చీరలకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చక్కటి గుర్తింపు ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కత్తా, చెన్నై, బెంగుళూరు, ఇండోర్‌ ప్రాంతాలతోపాటు అమెరికా, జర్మనీ, సింగపూర్‌ తదితర దేశాలకు సైతం మన చేనేత కార్మికులు రూపొందించిన వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. దేశం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో దాదాపు 14 శాతం వాటా తెలంగాణాదే కావడం విశేషం.
Samayam Telugu national handloom day on august 7
మన చేనేతకు పునర్వైభవం వచ్చేనా!


శనివారం నిర్వహించిన టౌన్‌హాలు కార్యక్రమంలో భాగంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవం గురించి ప్రస్తావించారు. దుస్తుల అవసరాల్లో 5 శాతం ఖాదీ, చేనేత వస్త్రాలు వినియోగించాలని మోదీ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. చేనేత వస్త్ర పరిశ్రమకు సహాకారం అందిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రమే మారిపోతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.