యాప్నగరం

సోనియా, రాహుల్ గాంధీలకు చుక్కెదురు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమె తనయుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎదురుదెబ్బ తగిలింది.

TNN 12 May 2017, 3:06 pm
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమె తనయుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో సోనియా, రాహుల్ లను విచారించాలని ఢిల్లీ హైకోర్టు ఆదాయపన్ను శాఖను ఆదేశించింది. ఇదే కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడలు కూడా నిందితులుగా ఉన్నారు.
Samayam Telugu national herald case sonia rahul gandhi to be investigated by tax officials
సోనియా, రాహుల్ గాంధీలకు చుక్కెదురు


నేషనల్ హెరాల్డ్ పత్రిక (2008లో మూతపడింది) ప్రచురణ సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు కాంగ్రెస్ పార్టీ 2010లో రూ.90 కోట్ల రుణం ఇచ్చింది. ఆ రుణాన్ని వసూలు చేసే హక్కును రూ.50 లక్షలకే యంగ్ ఇండియా లిమిటెడ్(వైఐఎల్)కు కట్టబెట్టింది.

నేషనల్ హెరాల్డ్ విషయంలో రూ.2వేల కోట్ల దుర్వినియోగానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆరోపిస్తూ బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి కేసు దాఖలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.