యాప్నగరం

నేవీ ఫైటర్ జెట్‌కు ప్రమాదం.. తప్పించుకున్న పైలట్

భారత నావికాదళానికి చెందిన మిగ్-29కే యుద్ధ విమానం బుధవారం గోవాలో ప్రమాదానికి గురైంది.

TNN 3 Jan 2018, 3:47 pm
భారత నావికాదళానికి చెందిన మిగ్-29కే యుద్ధ విమానం బుధవారం గోవాలో ప్రమాదానికి గురైంది. గోవాలోని డాబోలిమ్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి రన్‌వే నుంచి పక్కకు జారిపోయింది. వెంటనే జెట్‌లో మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే పైలట్ బయటికి దూకేయడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తక్షణమే రంగంలోకి దిగిన అత్యవసర సేవల బృందం మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదం కారణంగా ఎయిర్‌పోర్టులో సుమారు రెండు గంటలపాటు విమానాల రాకపోకలను నిలిపివేశారు. గోవాలో డబోలిమ్ ఎయిర్‌పోర్టు ఒక్కటే ఉండటంతో పౌర విమానసేవలు ఆటంకం ఏర్పడింది.
Samayam Telugu navys mig 29k fighter jet skids off runway in goa
నేవీ ఫైటర్ జెట్‌కు ప్రమాదం.. తప్పించుకున్న పైలట్

Fire on MiG-29K aircraft being extinguished at Goa airport, after the aircraft went off runway while taking off & caught fire pic.twitter.com/woeBWmqgY1 — ANI (@ANI) January 3, 2018
ట్రైనీ పైలట్ మిగ్-29కే ఫైటర్ జెట్‌తో టేకాఫ్‌ తీసుకున్నారని, అయితే ప్రమాదవశాత్తు జెట్ అదుపుతప్పి రన్‌వే నుంచి జారిపోయిందని నేవీ ప్రకటించింది. ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్ నుంచి ఈ మిగ్-29కే యుద్ధ విమానాలను నేవీ ఆపరేట్ చేస్తోంది. మొత్తం 45 మిగ్-29కే విమానాలను నేవీ నడుపుతోంది. వీటిని భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు ఈ జెట్ ప్రమాదానికి గురికావడంతో నేవీకి భారీగా నష్టం ఏర్పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.