యాప్నగరం

మోడీ కేబినెట్‌లోకి ఆ పార్టీనా..!

దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి వైరి వర్గంగా మెలుగుతున్న

TNN 31 Aug 2017, 2:38 pm
దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి వైరి వర్గంగా మెలుగుతున్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మోడీ కేబినెట్‌లోకి జాయిన్ అయ్యే అవకాశాలున్నాయనే ఊహాగానాలు ఆసక్తిదాయకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి శరద్ పవార్ పెట్టుకున్న ఎన్సీపీ ఆ తర్వాత కాంగ్రెస్ తో జతగానే సాగింది. యూపీఏలో కీలక పాత్ర పోషించింది. యూపీఏ-1, యూపీఏ-2 మంత్రివర్గాల్లో ఎన్సీపీ నేతలు ఉండేవారు. ఇక మహారాష్ట్రలో కూడా ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల కూటమి దశాబ్దానికి పైగా ప్రభుత్వాన్ని కొనసాగించింది.
Samayam Telugu ncp to join modi cabinet
మోడీ కేబినెట్‌లోకి ఆ పార్టీనా..!


ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఎన్సీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే వాళ్లు. మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎన్సీపీని మోడీ తీవ్రంగా విమర్శించారు. ఎన్సీపీ అంటే.. నేచురల్ కరప్షన్ పార్టీ.. అని కూడా అన్నారు. అయితే.. ఆ తర్వాతి రాజకీయ సమీకరణాలు బీజేపీ, ఎన్సీపీల మధ్య దూరాన్ని తగ్గించాయి. ప్రత్యేకించి మహారాష్ట్రలో శివసేనతో భారతీయ జనతా పార్టీతో తరచూ తలెత్తుతున్న విబేధాల నేపథ్యంలో ఎన్సీపీని మచ్చిక చేసుకోవడానికి ప్రాధాన్యతను ఇచ్చింది బీజేపీ.

ఈ నేపథ్యంలో అతిత్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఎన్సీపీ నేతలకు మోడీ అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. రాజకీయంగా ఒకానొక దశలో తీవ్రంగా విమర్శించుకున్న వర్గాలు ఇప్పుడు మిత్రపక్షాలుగా మారుతుండటం ఆసక్తికరంగా ఉంది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని మోడీ ఎన్సీపీకి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అవినీతిపరమైన పార్టీ అని తను విమర్శించిన పార్టీ వారినే మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకుంటే అది విడ్డూరమే అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.