యాప్నగరం

త్వరలో కొత్త రూ.10 నోట్లు: ఆర్బీఐ

తర్వలో కొత్త రూ.10 నోట్లను జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది. ఈ కొత్త నోట్లలో అధునాతన భద్రత సదుపాయాలు ఉంటాయని తెలిపింది.

TNN 9 Mar 2017, 2:41 pm
త్వరలో కొత్త రూ.10 నోట్లను జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది. ఈ నోట్లలో అధునాతన భద్రత సదుపాయాలు ఉంటాయని తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో కూడిన మహాత్మా గాంధీ సీరీస్- 2005 నోటుపై అదనంగా ఎల్ గుర్తును చేర్చినట్లు తెలియజేసింది. 2017లో ముద్రించే ఈ నోట్ల నెంబర్లను ఎడమ నుంచి కుడికి ఆరోహణ క్రమంలో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది.
Samayam Telugu new rs 10 notes with more security coming soon
త్వరలో కొత్త రూ.10 నోట్లు: ఆర్బీఐ


ఇందులో మొదటి మూడు అల్ఫా-న్యుమరిక్ అక్షరాలు స్థిరమైన పరిమాణంలో ఉంటాయని వివరించింది. ప్రస్తుతం పాత రూ.10 నోట్లు కూడా చలామణిలో ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. దేశంలోని నల్లధనం వెలికితీతకు చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు గతేడాది నవంబరు 8 న ప్రధాని ప్రకటించారు. ప్రధాని ప్రకటనతో నల్ల కుబేరులు తమదగ్గరున్న సొమ్మును ఎలా మార్చుకోవాలో తెలియక అనేక అక్రమాలకు కూడా పాల్పడ్డారు. పాత నోట్ల మార్పిడికి కేంద్రం గడువు విధించడంతో చలామణిలో ఉన్న రూ.14 లక్షల కోట్ల ధనం బ్యాంకులకు చేరుకుంది. వాటి స్థానంలో ముందు రూ.2,000 నోట్లను విడుదల చేసిన ఆర్బీఐ ఆ తర్వాత .500 నోట్లను ముద్రించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.