యాప్నగరం

పెళ్లయిన ఆర్నెల్లకే యువతి అనుమానాస్పద మృతి.. షాకింగ్ విషయం చెప్పిన తల్లిదండ్రులు

దొడ్డ తాలూకా దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కసాఘట్ట గ్రామంలో వరకట్న దాహానికి మోనిషా (20) అనే నవ వధువు బలైంది. మోనిషాకు ఎప్పుడూ ఫిట్స్‌ రావని, భర్త, కుటుంబ సభ్యులతో కలిసి హత్యచేసి నాటకామాడుతున్నారని యువతి తల్లిదండ్రులు తెలిపారు.

Samayam Telugu 12 May 2021, 1:47 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో యువతి అనుమానాస్పద మరణం
  • ఫిట్స్‌తో చనిపోయిందని చెబుతున్న అత్తింటివారు
  • భర్త, అత్తింటివారిపై కేసు నమోదు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
పెళ్లయిన ఆరు నెలలకే వరకట్న వేధింపులకు యువతి బలైన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. దొడ్డ తాలూకా దొడ్డబెళవంగల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కసాఘట్ట గ్రామానికి చెందిన ముత్తేగౌడ అనే యువకుడిని మోనిషా (20)తో ఆర్నెల్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో మోనిషా తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ముట్టజెప్పారు.
అత్తింట్లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే మోనిషాకు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టారు. ఈ నేపథ్యంలో మోనిషా అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ముత్తేగౌడ ఫిట్స్‌తో చనిపోయిందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోనిషాకు ఎప్పుడూ ఫిట్స్‌ రావని, భర్త, కుటుంబ సభ్యులతో కలిసి హత్యచేసి నాటకామాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ముత్తేగౌడ, అతడి తల్లి శారదమ్మ, తండ్రి శివకుమార్, చెల్లెలు సుధలపై కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.