యాప్నగరం

ప్రధాని మోడీపై దాడికి ఆల్‌ఖైదా కుట్ర.. ముగ్గురు అరెస్ట్!

ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులని సోమవారం నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ...

TNN 29 Nov 2016, 6:06 am
ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులని సోమవారం నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మధురైలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ సహా దేశానికి చెందిన 22 మంది అగ్ర నేతలని హతమార్చేందుకు ఈ ముగ్గురు కుట్ర పన్నినట్టుగా పోలీసులు స్పష్టంచేశారు. అంతేకాకుండా భారత్‌లో వున్న వివిధ దేశాల రాయభార కార్యాలయాలపై బెదిరింపులకి పాల్పడటంలో ఈ ముగ్గురికి పాత్ర ఉందని పోలీసులు తెలిపారు.
Samayam Telugu nia arrests 3 al qaida suspects who were planning to attack pm narendra modi
ప్రధాని మోడీపై దాడికి ఆల్‌ఖైదా కుట్ర.. ముగ్గురు అరెస్ట్!


అరెస్ట్ అయినవారిని ఎం కరీం, ఆసిఫ్ సుల్తాన్ మొహమ్మద్, అబ్బాస్ అలీగా గుర్తించారు. వీరిలో కరీంని ఉస్మాన్‌సాగర్ నుంచి అరెస్ట్ చేయగా, ఆసిఫ్ సుల్తాన్‌ని జీఆర్ నగర్, అబ్బాస్ అలీని ఇస్మాయిల్‌పురం నుంచి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పేలుడు సామాగ్రి సైతం స్వాధీనం చేసుకున్నారు.

దక్షిణ తమిళనాడులోని మధురై కేంద్రంగా ఆల్‌ఖైదా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే స్పష్టమైన సమాచారంతోనే ఎన్ఐఏ ఈ దాడులు జరిపి వారిని అరెస్ట్ చేసిందని పోలీసులు తెలిపారు. ఇదిలావుంటే పరారీలో వున్న మరో ఇద్దరు ఉగ్రవాదులు.. హకీం, దావూద్ సులేమాన్ కోసం ఎన్ఐఏ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.