యాప్నగరం

ఉరి అమలుకు ఒక్కరోజు ముందు.. సుప్రీంలో నిర్భయ దోషి పిటిషన్, తీర్పు వెల్లడి

ఉరి శిక్ష అమలుకు ఒక్క రోజు ముందు నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. రేప్ చేసిన సమయంలో తను మైనర్‌ అనే వాదనను మరోసారి తెరమీదకు తీసుకొచ్చాడు.

Samayam Telugu 31 Jan 2020, 7:07 pm
ఉరిశిక్ష అమలు తేదీ దగ్గరపడుతున్న వేళ.. చావును తప్పించుకోవడానికి నిర్భయ దోషులు తమ దగ్గరున్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటున్నారు. కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన తర్వాత ముగ్గురు దోషులు వేర్వేరుగా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని న్యాయస్థానం కొట్టి వేసింది. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించారు. రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ముకేశ్ సింగ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం దాన్ని కూడా కొట్టివేసింది.
Samayam Telugu pawan gupta


ఉరి అమలుకు ఒక్క రోజు ముందు నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. గతంలో తన జువైనల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కోట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అతడు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. 2012లో పారామెడికల్ విద్యార్థిని అయిన నిర్భయను రేప్ చేసే సమయానికి తాను మైనర్‌ను అని పవన్ వాదిస్తున్నాడు. ఇదే విషయమై గతంలో హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టివేసింది.

Read Also: నిర్భయ దోషుల ఉరి వాయిదా..

నిర్భయ హత్యాచారం కేసులో ఆరుగురు దోషులుగా తేలగా.. వీరిలో ఒకరు మైనర్. అతడిని మూడేళ్లపాటు జువైనల్ హోంలో ఉంచారు. పవన్ గుప్తా కూడా తాను అప్పుడు మైనర్‌ని అని వాదిస్తున్నాడు. దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ కేసు విచారణలో ఉండగానే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్, అక్షయ్ థాకూర్, ముకేశ్ సింగ్, పవన్ గుప్తాలను ఫిబ్రవరి 1న ఉరితీయాలని న్యాయస్థానం ఆదేశించింది.

Read Also: నిర్భయ దోషి పవన్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం.. కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ కోర్టులో దోషుల పిటిషన్:
నిర్భయ దోషుల్లో వినయ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉందని.. అతడ్ని మినహా మిగతా ముగ్గుర్ని ఉరి తీయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తిహార్ జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా జైలు నిబంధనల ప్రకారం ఒక కేసులో దోషులుగా ఉన్న నలుగురు దోషుల్నీ ఒకేసారి ఉరి తీయాలని దోషుల తరఫు లాయర్ వాదించారు. శుక్రవారం సాయత్రం న్యాయస్థానం తీర్పును వెలువరించనుంది.

Read Also: దోషుల లాయర్ సవాల్ చేశాడు.. వారికి ఉరి పడదా?: నిర్భయ తల్లి కంటతడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.