యాప్నగరం

నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు షాక్.. ఉరి అమలు రేపే

ఉరి అమలును వాయిదా వేయాలంటూ నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను పాటియాలా హౌస్ కోర్టు తిరస్కరించింది. దీంతో వారిని ముందుగా నిర్ణయించిన మేరకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తిహార్ జైల్లో ఉరి తీయనున్నారు.

Samayam Telugu 19 Mar 2020, 5:33 pm
2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు దోషుల ఉరి శిక్ష అమలుపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తిరస్కరించింది. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాల్సి ఉండగా.. డెత్ వారంట్ అమలుపై స్టే విధించాలని కోరుతూ వినయ్, పవన్, అక్షయ్ బుధవారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్‌ను ఉద్దేశించి జడ్జి ధర్మేంద్ర రాణా స్పందిస్తూ.. మీరెప్పుడూ ఆఖరి నిమిషంలో వస్తుంటారని అసహనం వ్యక్తం చేశారు. మరణ శిక్ష అమలుపై స్టే విధించడానికి కోర్టు నిరాకరించడంతో.. నలుగురు దోషుల్ని శుక్రవారం ఉదయం తిహార్ జైల్లో ఉరి తీయనున్నారు.
Samayam Telugu nirbhaya convicts


పవన్ గుప్తా దాఖలు చేసిన రెండో క్షమాభిక్ష పిటిషన్, సుప్రీంలో అతడు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నాయని.. తిహార్ జైలు సిబ్బందిపై పవన్ ఫిర్యాదు చేశాడని.. అక్షయ్ భార్య విడాకులు కోరుతూ బిహార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని.. తన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ వినయ్ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడని.. అంతర్జాతీయ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారని.. ఇలా అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని దోషుల తరఫు లాయర్ వాదించారు.

ఢిల్లీలో కోవిడ్-19 ఉందని, భారీ సంఖ్యలో జనం గుమికూడటంపై ఆంక్షలు ఉన్నాయని కూడా నిర్భయ దోషులు తమ పిటిషన్లో పేర్కొనడం గమనార్హం. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఉరి శిక్ష అమలు వాయిదా వేయాలని కోరారు. కాగా పవన్ గుప్తా, ముకేశ్ సింగ్ పిటిషన్లను సుప్రీం గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే.

Read Also: నిర్బయ దోషులకు ఉరి: జైల్లో రిహార్స్ పూర్తి.. దోషి వినయ్ తల్లి చివరి కోరిక ఇదే

ఈ పిటిషన్ వాదనల సందర్భంగా కోర్టు బయట డ్రామా చోటు చేసుకుంది. విడాకుల పిటిషన్ దాఖలు చేసిన అక్షయ్ భార్య మైకం వచ్చి పడిపోయింది.

Read Also: భారత్‌లో నాలుగో కరోనా మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.