యాప్నగరం

నిర్భయ దోషులకు డెత్ వారంట్ జారీ.. ఈసారైనా?

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు తేదీలను పాటియాలా ట్రయల్ కోర్టు ఖరారు చేసింది. మార్చి 3న ఉదయం 6 గంటలకు వీరిని తిహార్ జైల్లో ఉరి తీయనున్నారు.

Samayam Telugu 17 Feb 2020, 4:33 pm
నిర్భయ దోషులకు పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. మార్చిన 3న ఉదయం ఆరు గంటలనకు నలుగురు దోషులను ఉరి తీయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తాజా తీర్పుతో తిహార్ జైల్లో మార్చి 3న వీరందర్నీ ఒకేసారి ఉరి తీసే అవకాశం ఉంది. నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయాల్సి ఉండగా.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వారి ఉరి శిక్ష అమలును నిలిపేయాలని పాటియాల కోర్టు జనవరి 31న తీర్పునిచ్చింది. దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని స్పష్టం చేసింది.
Samayam Telugu nirbhaya convicts


ఈ తీర్పును సవాల్ చేస్తూ.. కేంద్రం హైకోర్టుకు వెళ్లగా.. ట్రయల్ కోర్టు తీర్పును న్యాయస్థానం సమర్థించింది. దీంతో కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లింది. నిర్భయ దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు జనవరి 22ను ఉరితీయాలంటూ జనవరి 7న పాటియాలా హౌస్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్లు పెండింగ్‌లో ఉండటం, దోషులు అప్పీలు చేయడంతో ఉరి వాయిదాపడింది.

ఫిబ్రవరి 1న ఉరి తీయాలని ఆదేశిస్తూ ట్రయల్ కోర్టు జనవరి 17న రెండోసారి డెత్ వారంట్ జారీ చేసింది. దీనిపై దోషుల తరపు న్యాయవాది వాదనలను వినిపిస్తూ ఒకరి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉందని, నిబంధనల మేరకు మిగిలిన ముగ్గుర్ని ఉరి తీయడం సాధ్యం కాదన్నారు.

నిర్భయ దోషులు న్యాయపరంగా తమ ముందున్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని గతంలో న్యాయ స్థానం అభిప్రాయపడింది. కాగా.. నా హక్కు సంగతి ఏంటని నిర్భయ తల్లి కోర్టు ప్రాంగణంలో వాపోయారు. దోషులకు ఉరిశిక్ష అమలు కాకుండా చూస్తానని లాయర్ సవాల్ చేశారని ఆమె ఆరోపించారు. తాజాగా కోర్టు డెత్ వారంట్ జారీ చేయడం పట్ల నిర్భయ తల్లి ఆనందం వ్యక్తం చేశారు. కాగా తమ ముందు ఇక న్యాయపరమైన మార్గాలు మిగిలే ఉన్నాయని దోషుల తరఫు లాయర్ ఏపీ సింగ్ తెలిపారు.

పవన్ గుప్తా మినహా మిగతా ముగ్గురు దోషులు రివ్యూ పిటిషన్, క్యురేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్లను దాఖలు చేశారు. పవన్ రివ్యూ పిటిషన్ మాత్రమే దాఖలు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.