యాప్నగరం

ఉరి నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషుల ఆఖరి ప్రయత్నాలు

మరణ శిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషుల ఆఖరి ప్రయత్నాలు. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న ముఖేష్ సింగ్. మిగిలిన ఇద్దరు దోషులతో క్యూరేటివ్ పిటిషన్ వేయించే ఆలోచనలో లాయర్.

Samayam Telugu 15 Jan 2020, 10:23 am
నిర్భయ కేసుల దోషులు మరణ శిక్ష నుంచి తప్పించుకోవడానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్లు కొట్టివేసినా బయటపడేందుకు తంటాలు పడుతున్నారు. తాజాగా రాష్ట్రపతికి ముఖేష్ అనే దోషులు మళ్లీ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు.. దీనిపై కోవింద్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. క్షమాభిక్ష పిటిషన్ మాత్రమే కాదు.. డెత్ వారెంట్‌ను పక్కన పెట్టాలని ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించాడు.
Samayam Telugu nirbhaya convicts


ఇదిలా ఉంటే నలుగురు దోషులు వారి కుటుంబసభ్యులను కలిసేందుకు తిహార్ జైలు అధికారులు అవకాశం ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా క్యూరేటివ్ పిటిషన్ కొట్టేయడంతో.. నిందితుల్ని కలవొచ్చని.. కాకపోతే వారిని కలిసేందుకు ఓ తేదీ చెప్పాలని జైలు అధికారులు వారిని కోరారట. మరణ శిక్ష ఈ నెల 22న అమలు చేయనుండటంతో.. ఈ నెల 20లోపే వారిని కలవడానికి అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉంటే.. నిర్భయ కేసులో మరో ఇద్దరు దోషులు అక్షయ్, పవన్‌ తరఫున సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్లను వేసేందుకు సిద్ధమవుతున్నారు. వారి తరపున లాయర్ పిటిషన్లు వేస్తామని చెబుతున్నారు. ఈ నలుగురు దోషులపై ట్రయల్‌ కోర్టు జారీ చేసిన డెత్‌ వారెంట్‌ను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన ఉన్నారట. దీంతో నిర్భయ కేసు మళ్లీ ఆసక్తిరేపుతోంది.. దోషులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు జరుగుతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

నిర్భయ కేసులో వినయ్‌ శర్మ, ముకేశ్‌ కుమార్‌, అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తాలను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీ ట్రయల్‌ కోర్టు జనవరి 7న డెత్‌ వారెంట్ట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. నలుగురు దోషుల్లో వినయ్‌ శర్మ, ముకేశ్‌ కుమార్‌లు సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్లు వేయగా.. మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.