యాప్నగరం

వెక్కివెక్కి ఏడ్చిన నిర్భయ తల్లి.. ఇంకెప్పుడు న్యాయం?

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయడంపై పటియాలా కోర్టు స్టే విధించడంపై బాధితురాలి తల్లి తప్పుపట్టారు. ఈ సందర్భంగా కంటతడిపెట్టారు.

Samayam Telugu 2 Mar 2020, 9:47 pm
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు విషయంలో పటియాలా హౌస్‌ కోర్టు మరోసారి ‘స్టే’ విధించడంపై బాధితురాలి తల్లి ఘాటుగా స్పందించారు. ఆ కిరాతకులకు ఉరిశిక్ష అమలు ప్రక్రియను పదేపదే వాయిదా వేయడం.. మన వ్యవస్థ వైఫల్యాన్ని చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ దోషులకు మంగళవారం విధించాల్సిన ఉరిశిక్షపై పటియాలా హౌస్‌ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు ఆవరణంలోనే కూలబడిన ఆమె కొద్దిసేపు వెక్కివెక్కి ఏడ్చారు.
Samayam Telugu nirbhaya mother


Also Read: నిర్భయ కేసు దోషుల ఉరి మరోసారి వాయిదా..

అనంతరంనిర్భయ తల్లి మీడియాతో మాట్లాడుతూ.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఎందుకింత సమయం తీసుకుంటోందని ప్రశ్నించారు. దోషులకు శిక్ష ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. నలుగురు నిందితుల్లో ఒకడైన పవన్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి ముందు పెండింగ్‌లో ఉన్నందున తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఉరిశిక్ష నిలిపివేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. దీంతో నిర్భయ తల్లి స్పందిస్తూ.. దోషులను ఉరి తీయాలంటూ ఇచ్చిన సొంత ఆదేశాలను అమలు చేయడానికి న్యాయస్థానాలు ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నట్లని ప్రశ్నించారు.

Also Read: చింతమనేని మళ్లీ యాక్టివ్.. ఎక్కడ దెబ్బతిన్నాడో, అక్కడే వెతుక్కుంటూ..

ఉరిశిక్షను పదేపదే వాయిదా వేయడం మన వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మన వ్యవస్థ మొత్తం నిందితులకే మద్దతు ఇస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టు ఏమి చేస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోందని మండిపడ్డారు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉదయం ఉరి తీయాల్సి ఉంది. ఈ క్రమంలో తమ డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్‌ గుప్తా పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ విచారణ జరిపిన న్యాయస్థానం స్టే విధించింది.

Also Read: పింఛన్ల డోర్ డెలివరీపై మాజీ సీఎస్ సంచలన వ్యాఖ్యలు.. గట్టిగా తగులుకున్న వైసీపీ కార్యకర్తలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.