యాప్నగరం

దోషులకు ఉరి పడదా.. నిర్భయ తల్లి కంటతడి

Nirbhaya Case: పాటియాల కోర్టు తీర్పుతో నిర్భయ తల్లి కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం, న్యాయస్థానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 31 Jan 2020, 7:13 pm
పాటియాలా కోర్టు తీర్పు అనంతరం నిర్భయ తల్లి ఆశా దేవి కంటతడి పెట్టారు. వ్యవస్థలపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష పడేదాకా తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దోషులను ఉరి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏడేళ్లుగా తాను పోరాటం చేస్తున్నా.. దోషులు ఏం కోరుకుంటున్నారో ఆదే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. దోషులకు ఎప్పటికీ ఉరిశిక్ష పడదంటూ వారి తరఫు న్యాయవాది ఏపీ నింగ్‌ సవాల్‌ విసిరాడని ఆశా దేవి ఆరోపించారు. ఇన్ని రోజులుగా వేచి చూస్తున్నందుకు ఫలితం ఇదేనా అని ప్రశ్నించారు.
Samayam Telugu asha devi


2012లో దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్‌ రేప్ దోషులకు శనివారం (ఫిబ్రవరి 1) ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉండగా.. ఢిల్లీలోని పాటియాల న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయొద్దంటూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. పాటియాల కోర్టు ఆదేశాలపై ఆశా దేవి అసహనం వ్యక్తం చేశారు.

దోషులు తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అదనపు సెషన్స్‌ జడ్జి జస్టిస్ ధర్మేందర్‌ రాణా ఉరిశిక్ష అమలుపై స్టే విధించారు. దోషులకు డెత్‌ వారెంట్‌పై స్టే ఇవ్వడం ఇది రెండోసారి. వాస్తవానికి జనవరి 22నే నిర్భయ దోషులకు ఉరి తీయాల్సి ఉండగా తొలిసారి స్టే విధించారు. అనంతరం ఫిబ్రవరి 1న ఉరి తీయాలని డెత్‌ వారెంట్‌ జారీ చేశారు. తాజాగా ఉరి శిక్ష అమలు చేయడానికి కేవలం 12 గంటల ముందు మరోసారి స్టే విధించడం చర్చనీయాంశంగా మారింది.

నిర్భయ కేసు విచారణ సాగుతున్న తీరుపై ఆశా దేవి ఇప్పటికే పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, న్యాయస్థానాలపై రోజురోజుకూ విశ్వాసం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగి ఏడేళ్లు పూర్తవుతున్నా దోషులకు శిక్ష పడకపోవడం తప్పుడు సందేశాలు ఇస్తోందని.. దేశంలో మృగాళ్లు రెచ్చిపోతున్నారని ఆమె అన్నారు. పలువురు మహిళా సంఘాల సభ్యులు, ప్రజా సంఘాల నేతలు నిర్భయ తల్లి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.

Also Read: ఎమ్మెల్యే విజయానికి ఆ తాయత్తే కారణమట.. నేటికీ మెడలో, స్వామిజీ ఆడియో టేప్ వైరల్

Must Read: కరోనా వైరస్‌తో హెల్త్ ఎమర్జెన్సీ.. సమగ్ర సమాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.