యాప్నగరం

వంటవాడిగా నిర్భయ కేసు బాల నేరస్థుడు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ నిందితుల్లో నలుగురికి శుక్రవారం సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది

Samayam Telugu 6 May 2017, 12:52 pm
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ నిందితుల్లో నలుగురికి శుక్రవారం సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరిలో రామ్ సింగ్ 2013లో తిహార్ జైల్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడికి... 18ఏళ్లు (మైనర్) నిండలేదని బోస్టన్ స్కూల్ కు తరలించారు. అక్కడి నుంచి 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. అతణ్ని ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసింది.
Samayam Telugu nirbhya case juvenile accused is now a cook reveals ngo
వంటవాడిగా నిర్భయ కేసు బాల నేరస్థుడు!


అయితే ఇప్పుడా నిందితుడికి 23ఏళ్లు వచ్చాయి. అతడు ఇప్పుడెక్కడున్నాడో తెలుసా? దక్షిణ భారతదేశంలో ఓ ధాబాలో వంటవాడిగా పనిచేస్తున్నాడు. అయితే గత నేర చరిత్ర కారణంగా ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా... ఆ యువకుడి పేరు మార్చి.. చివరికి అతడు పనిచేసే ధాబా యజమానికి కూడా తెలియకుండా అక్కడ పనికి కుదిర్చింది ఎన్జీవో సంస్థ.

11ఏళ్ల వయసులో ఉన్నప్పుడే అతడు వేరే రాష్ట్రం నుంచి ఢిల్లీకి పారిపోయి వచ్చాడు. అతడి తల్లిదండ్రులు అనారోగ్యంతో మంచంపట్టారు.
ఢిల్లీలో ఓ ప్రైవేటు బస్సు నడుపుతున్న రామ్ సింగ్ (నిర్భయ కేసులో ప్రధాన నిందితుడు-ఆమె ఇదే బస్సులో ప్రయాణించి దుర్మార్గుల చేతిలో అత్యాచారానికి గురూంది) కు దగ్గరై.. అదే బస్సులో క్లీనర్ గా చేరారు.

బోస్టన్ స్కూల్లో సత్ప్రవర్తనతో మెలిగే వాడని సమాచారం. అక్కడి నుంచి విడుదలయ్యాక...బుద్దిగా ఉన్నాడని, రోజు ఐదుసార్లు నమాజ్ చేసుకునేవాడని ఎన్జీవో సంస్థ ప్రతినిధులు అంటున్నారు.
అతడికి వంట చేయడంపై ఆసక్తి ఉండటంటో అతని పేరు మార్చి ఎవరికీ తెలియని దూరం ప్రాంతం (సౌతిండియా)లోని ఓ ధాబాలో పనివాడిగా పెట్టినట్లు సంస్థ తెలిపింది. అతడి గురించి మిగతా ప్రపంచానికి తెలియకపోయినా పాత నేరచరిత్ర దృష్ట్యా నిఘా వర్గాలు మాత్రం అతడిపై కన్నేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.