యాప్నగరం

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఈ విషయాన్నిఆయనే వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.

Samayam Telugu 16 Sep 2020, 10:45 pm
మోదీ కేబినెట్‌లో మరో మంత్రికి కరోనా వైరస్ సోకింది. కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొవిడ్-19 మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Samayam Telugu నితిన్ గడ్కరీ
Nitin Gadkari


‘నిన్న కాస్త బలహీనంగా కనిపించడంతో ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించాను. వైద్య పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను’ అని గడ్కరీ ట్వీట్ చేశారు. ‘ఇటీవల నన్ను కలిసిన వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి..’ అంటూ మరో ట్వీట్ చేశారు.

దేశంలో కరోనా వైరస్ సామాన్యులతో పాటు ప్రముఖులనూ వణికిస్తోంది. కేంద్రంలో ఇప్పటికే ఏడుగురు మంత్రులకు కరోనా సోకింది. మొత్తం 25 మంది ఎంపీలు వైరస్ బారినపడ్డారు. పలు రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు కరోనా బారినపడ్డారు. పలువురు మృత్యువాతపడ్డారు కూడా.

Also Read: గల్వాన్‌లో చైనా వైపు 60 మంది జవాన్లు మృతి.. ఘోర పరాజయం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.