యాప్నగరం

సంఘపరివారేతర అలయన్స్ అవసరం

దేశంలోని హిందూత్వవాద సంఘ పరివార్ శక్తులను దీటుగా లౌకిక ప్రజాస్వామ్య పక్షాలన్నీ ఏకంకావాలని జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు బిహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు

TNN 17 Apr 2016, 2:53 pm
దేశంలోని హిందూత్వవాద సంఘ పరివార్ శక్తులను దీటుగా లౌకిక ప్రజాస్వామ్య పక్షాలన్నీ ఏకంకావాలని జనతాదళ్ యునైటెడ్ అధ్యక్షుడు బిహార్ సీఎం నితీశ్ కుమార్ పిలుపునిచ్చారు. గతంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెసేతర పక్షాల ఐక్యతకు పిలుపునిచ్చారు. అప్పట్లో ఆయన దానికి గైర్-కాంగ్రెస్ వాద్ అని పేరుపెట్టారు. దాన్ని గుర్తు తెచ్చేలా నితీశ్ గైర్-సంఘ్-వాద్ గా తన నినాదానికి నామకరణం చేసారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బీజేపీయేతర, ఆర్ఎస్ఎస్, సంఘపరివార శాఖలకు చెందని సంస్థలు ఒకే గొడుగు కిందకు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
Samayam Telugu nitish calls for national non sangh parivar alliance
సంఘపరివారేతర అలయన్స్ అవసరం


జేడీ (యు) అధ్యక్షునిగా గత ఆదివారం పగ్గాలు చేపట్టిన నితీశ్ పట్నాలోని ఒక సమావేశంలో శనివారం పాల్గొన్నారు. బీజేపీ నేతృత్వంలో హిందూత్వ శక్తులు ఎలా రెచ్చిపోతున్నాయో గమనిస్తున్న ప్రజలకు రానున్న కాలంలో దేశ రాజకీయ చిత్రపటం ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమవడం మొదలైందని చెప్పారు. ప్రస్తుతం పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న హిందూత్వ శక్తులను ఓడించడం అత్యవసరమన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.