యాప్నగరం

ఆ విషయంలో మోదీకి మద్దతుగా నితీష్

ఉరీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాంగ్రెస్ టార్గెట్‌గా చేసుకుంటే తన రాజకీయ ప్రత్యర్థి, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం ఆయనకు అండగా నిలిచారు.

TNN 22 Sep 2016, 10:55 am
ఉరీ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాంగ్రెస్ టార్గెట్‌గా చేసుకుంటే తన రాజకీయ ప్రత్యర్థి, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం ఆయనకు అండగా నిలిచారు. భద్రతాచర్యల విషయంలో కేంద్రప్రభుత్వం అలర్ట్ గానే ఉందని నితీష్ స్పష్టం చేశారు. కశ్మీర్ లోని ఉరీ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తీవ్రవాదును ఎదుర్కొనేందుకు రాజకీయాలన్నీ పక్కనబెట్టి అంతా ఒక్కటికావాలని ఆయన పిలుపునిచ్చారు. తీవ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌ ఆగడాలను అడ్డుకునేందుకు తమవంతుగా ప్రయత్నించాలని ఆయన సూచించారు. గతకొన్నిరోజులుగా కశ్మీర్ లో చెలరేగుతున్న హింసను అణిచివేసేందుకు మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యలను నితీష్ అభినందించారు.
Samayam Telugu nitish kumar supports modi for national interest
ఆ విషయంలో మోదీకి మద్దతుగా నితీష్

అటు రైల్వే ప్రత్యేక బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడాన్ని ఆయన స్వాగతించారు. దీనివల్ల ప్రత్యేక లాభం లేకపోయినా రైల్వే బడ్జెట్ పేరుతో ఇన్నిరోజులు సాగిన ‘ఆధిపత్యం’ తగ్గుతుందని నితీష్ అభిప్రాయపడ్డారు.

Bihar CM Nitish Kumar extended his support to his arch-rival PM Modi over Uri attack where the centre is facing criticism from the congress. Nitish said brushing aside politics for national interest and be united to fight terrorism. He also stood with the centre on the Kashmir issue and taking defence measures.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.