యాప్నగరం

27మంది చనిపోలేదు: బీహార్‌ ప్రమాదంపై మాట మార్చిన మంత్రి

బీహార్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 27మంది చనిపోయారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి దినేష్ చంద్ర యాదవ్ మాట మార్చారు. 24 గంటలు కూడా గడవకముందే... ఆయన ప్రమాదంలో చనిపోలేదని చెప్పారు.

Samayam Telugu 4 May 2018, 3:36 pm
బీహార్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 27మంది చనిపోయారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి దినేష్ చంద్ర యాదవ్ మాట మార్చారు. 24 గంటలు కూడా గడవకముందే... ఆయన ప్రమాదంలో చనిపోలేదని చెప్పారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో నిన్న అలా చెప్పానని... తుది నివేదిక తర్వాత ఎంతమంది చనిపోయారన్నది తెలుస్తుందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బస్సులో 31మంది టిక్కెట్లు బుక్ చేసుకుంటే... ప్రమాదం జరిగిన సమయంలో 13మంది మాత్రమే ఉన్నట్లు స్పాట్‌లో ఉన్నవారు చెప్పారని... మిగతా వాళ్లు గోపాల్ గంజ్‌లో ఎక్కాల్సి ఉందన్నారు. ఈలోపే బస్సుకు ప్రమాదం జరిగినట్లు చెప్పుకొచ్చారు.
Samayam Telugu Accident Issue


ఘటనలో గాయపడిన 8మందిని ఆస్పత్రికి తరలించామని... మరో ఐదుగురి ఆచూకీ తెలియలేదన్నారు దినేష్ చంద్ర యాదవ్ . వాళ్లకు సంబంధించిన డెడ్ బాడీలు కూడా ఏమీ కనిపించ లేదన్న మంత్రి... ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నామన్నారు. అయితే మంత్రే స్వయంగా నిన్న 27మంది చనిపోయినట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా కూడా ఇస్తామని చెప్పారు. కాని ఇవాళ మాత్రం మాట మార్చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.