యాప్నగరం

పీవీ పాలనలో అభివృద్ధి శూన్యం: జైట్లీ

దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హాయంలోనూ 1శాతం మించిన వృద్ధిని కూడా సాధించలేకపోయామని

TNN 20 Aug 2016, 4:06 pm
స్వాతంత్ర్యం అనంతరం దేశాన్ని పాలించిన నెహ్రూ, ఆయన వారసుల పాలనలో అభివృద్ధి ఆశించిన మేర జరగలేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హాయంలోనూ 1శాతం మించిన వృద్ధిని కూడా సాధించలేకపోయామని ఆయన ఆరోపించారు. జీఎస్టీపై ముంబైలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పీవీ నర్సింహారావు ఏమాత్రం సంస్కరణలకు ఆద్యుడు కాదని జైట్లీ అన్నారు. పీవీ పాలనలో ఒక్కశాతం జనాభాకూడా టెలిఫోన్లు వినియోగించలేకపోయారని విమర్శించిన ఆయన యూపీఏ ప్రభుత్వాలు అభివృద్ధిని అడ్డుకున్నాయని అన్నారు. ఎన్డీయే పాలనలో ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా లాంటి పథకాల వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయని, మేకిన్ ఇండియా అనేది కేవలం నినాదాలకు పరిమితం కాలేదని, అది మార్పునకు, అభివృద్ధికి దోహదకారిగా నిలిచిందని చెప్పుకొచ్చారు. జాతీయ బ్యాంకులను మరింత బలోపేతం చేసి దేశాన్ని ఆర్థికప్రగతిలో ముందుకు నడిపిస్తామని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.