యాప్నగరం

సీఎం కావడానికి శశికళకు అడ్డంకుల్లేవ్!

తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు

Samayam Telugu 8 Feb 2017, 3:49 pm
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు న్యాయపరమైన అడ్డంకులు లేవని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలే శశికళను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారని..ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని ఆయన స్పష్టం చేశారు.
Samayam Telugu no hurdles for sasikala to be cm says attorney general mukul rohatgi
సీఎం కావడానికి శశికళకు అడ్డంకుల్లేవ్!


శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం అంశంపై గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు న్యాయ సలహా తీసుకున్నారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.
కాగా, జ‌య‌ల‌లిత అక్రమాస్తుల కేసులో శశిక‌ళా న‌ట‌రాజ‌న్ నిందితురాలిగా ఉన్నారు. 2015లో క‌ర్నాట‌క కోర్టు త‌న తీర్పులో శశికళ బంధువులు ఇల‌వ‌ర‌సి, సుధాక‌ర‌న్‌తో పాటు ఆమెను కూడా నిందితురాలిగా చేర్చింది. సుప్రీంకోర్టుకు చెందిన ధ‌ర్మాస‌నం ఈ కేసుపై తీర్పును రిజ‌ర్వ్‌లో ఉంచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.