యాప్నగరం

పీఓకే భారత్‌లో అంతర్భాగం... సుష్మా

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమని, పాకిస్థాన్ దీన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు.

TNN 18 Jul 2017, 1:23 pm
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమని, పాకిస్థాన్ దీన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. చికిత్స కోసం భారత్‌కు రావాలనుకున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యక్తికి వీసా ఇవ్వడాన్ని సుష్మాస్వరాజ్ సమర్థించుకున్నారు. పీవోకే చెందిన ఒసామా అలీ అనే వ్యక్తి కాలేయ మార్పిడి చికిత్స కోసం ఢిల్లీకి రావాలనుకుని పాక్ విదేశాంగ శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, అతడి వీసా దరఖాస్తును సిఫారసు చేస్తూ భారత హైకమిషన్‌కు లేఖ రాసేందుకు పాక్ ప్రధాని విదేశాంగ సలహాదారుడు సర్తాజ్ అజీజ్ నిరాకరించారు. కానీ, అతడికి తాము వీసా జారీ చేస్తామని సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో భాగమేనని, అక్కడి ప్రజలకు వీసా ఇచ్చేందుకు పాకిస్థాన్ లేఖ అవసరం లేదంటూ సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు.
Samayam Telugu no letter from aziz ailing pok student appeals for visa to sushma swaraj
పీఓకే భారత్‌లో అంతర్భాగం... సుష్మా


POK is an integral part of India. Pakistan has illegally occupied it. We are giving him visa. No letter required. https://t.co/cErxQw7Cht — Sushma Swaraj (@SushmaSwaraj) July 18, 2017
పీఓకేలోని రావల్‌కోట్‌కు చెందిన ఒసామా అలీ అనే 24 ఏళ్ల యువకుడు కాలేయంలో ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. భారత్‌లో చికిత్స కోసం అతడి కుటుంబం మెడికల్ వీసాకు పాక్ విదేశాంగ శాఖలో దరఖాస్తు చేసింది. అయితే దీనికి సర్తాజ్ అజీజ్ లేఖ రాయడానికి నిరాకరించాడు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ సభ్యుడైన ఒసామా తండ్రి జావేద్ నజ్ ఖాన్ తన కొడుకు వీసా కోసం విఫలయత్నం చేశాడు. పీఓకే అధ్యక్షుడు మసూద్ ఖాన్‌తోనూ సిఫార్సు చేసి పాక్ విదేశాంగ శాఖ భారత్ హైకమిషనర్‌కు లేఖ రాయకుండా దక్షిణాసియా విభాగానికి రాశారు. దీంతో ఆయన భారత విదేశాంగ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే సూచనతో సుష్మా స్వరాజ్‌ను ఆశ్రయించారు. తన కుమారుడి చికిత్స కోసం మెడికల్ వీసా మంజూరు చేయాలని ట్విట్టర్ ద్వారా సుష్మాను అర్ధించడంతో ఆమె దీనికి సమ్మతించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.