యాప్నగరం

లాక్‌డౌన్‌ పరిష్కారం కాదు.. గోవా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నాం. అయినా లాక్‌డౌన్ ఒక్కటే కరోనా కట్టడికి పరిష్కారం కాదంటూ గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 7 Apr 2021, 7:51 pm
కరోనా మరోమారు విజృంభిస్తుండడంతో రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న మహారాష్ట్రలో పాక్షికంగా నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. అయితే ఆ పొరుగునే ఉన్న గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాత్రం లాక్‌డౌన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై లాక్‌డౌన్ విధించడం తమ వల్ల కాదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
goa cm


లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తప్పవని సావంత్ అభిప్రాయపడ్డారు. గతేడాది ఇదే సమయంలో నెలకొన్న పరిస్థితులను ఆయన గుర్తు చేశారు. లాక్‌డౌన్ కారణంగా జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. టూరిజం, పరిశ్రమలు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందని.. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ విధించబోమని ఆయన స్పష్టం చేశారు.

పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో నమోదవుతున్న కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నామని.. ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని సావంత్ అన్నారు. అయినా కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం కాదన్న ఆయన.. కోవిడ్ నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించడం, కరోనా వ్యాక్సినేషన్‌తోనే నియంత్రణ సాధ్యమని సావంత్ చెప్పుకొచ్చారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.