యాప్నగరం

ఆరోగ్య సేవలపై సర్వీస్ ట్యాక్స్.. కేంద్రం వివరణ

హెల్త్ కేర్ సేవలపై 5 శాతం పన్ను విధించేలా బడ్జెట్లో ప్రతిపాదించారని గత కొద్ది రోజులుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది.

TNN 14 Feb 2017, 11:09 am
హెల్త్‌కేర్ సేవలపై కేంద్రం 5 శాతం పన్ను విధించనున్న వార్తల్లో వాస్తవం లేదని తేలింది. 2017-18 బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదన ఏదీ తీసుకురాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయం తీవ్రం ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ విషయమై స్పష్టత ఇచ్చింది. ఆరోగ్య సేవలపై సర్వీస్ ట్యాక్స్ విధించాలన్న ప్రతిపాదన ఏదీ బడ్జెట్‌లో తీసుకురాలేదని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెలువరించింది. 2011-12 బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ తీవ్ర విమర్శలు వెల్లువత్తడంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
Samayam Telugu no proposal to levy service tax on healthcare says government
ఆరోగ్య సేవలపై సర్వీస్ ట్యాక్స్.. కేంద్రం వివరణ


ఇప్పటికే రకరకాల పన్నుల పేరిట ప్రజల జేబులకు చిల్లులు పడుతుండటంతో ఆరోగ్య సేవలపై కూడా ఎక్కడ లెవీ విధిస్తారో అని జనం ఆందోళన చెందారు. కానీ కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.