యాప్నగరం

భారత్‌లో అసహనానికి చోటు లేదు: రాష్ట్రపతి

‘‘భారత్ లో అసహనానికి చోటు లేదు. విశ్వవిద్యాలయాల్లో అశాంతిని పురికొల్పే బదులు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి’’

TNN 2 Mar 2017, 8:24 pm
‘‘భారత్ లో అసహనానికి చోటు లేదు. విశ్వవిద్యాలయాల్లో అశాంతిని పురికొల్పే బదులు సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి’’ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హితవు పలికారు.
Samayam Telugu no room in india for intolerant indian pranab mukherjee
భారత్‌లో అసహనానికి చోటు లేదు: రాష్ట్రపతి


గురువారం ఆయన కేరళలోని కొచ్చిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

ఢిల్లీ రామ్ జాస్ యూనివర్సిటీలో వారంలో రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల మధ్య చోటు చేసుకుంటున్న సంఘటనల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటనా హక్కు కల్పించిందని గుర్తు చేశారు. చట్టానికి లోబడి విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉండాలని ఆయన సూచించారు.

‘‘ఏన్నో ఏళ్లుగా భావ ప్రకటనా స్వేచ్ఛకు, ఆలోచనలకు భారత్ నెలవు. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలకు, భిన్న ఆలోచనలు, చర్చలకు మన సమాజం ఎంతో విలువనిస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత ప్రధానమైన హక్కు’’ అని ప్రణబ్ స్పష్టం చేశారు.

మహిళలకు హక్కులకు భంగం కల్గించే సమాజాన్ని తాను నాగరికత ఉన్న సమాజంగా అంగీకరించనని చెప్పిన ప్రణబ్...మహిళలపై దాడులు నాగరికతపై మరకలాంటిదని అన్నారు.

రాజకీయ నేతలు ప్రజల మనోభావాలను గుర్తెరిగి నడుచుకోవాలని..వారి ఆకాంక్షలను నెరవేర్చడమే నేతల లక్ష్యం కావాలన్నారు. ప్రజల అవసరాలు తీర్చుతూ వారి నుంచి ఎంతో నేర్చుకోవాలని సూచించారు. ప్రజలంటే ప్రజాప్రతినిధులకు అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.