యాప్నగరం

రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు వాట్సాప్ బంద్!

రాత్రి 10 దాటితే వాట్సాప్‌లో సందేశాలు ఇచ్చినా, ఎస్సెమ్మెస్‌లు, కాల్స్ చేసినా.. చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ నిబంధన ఎందుకు? ఎవరి కోసమో తెలుసా?

Samayam Telugu 13 Sep 2018, 4:21 pm
రికొద్ది రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపకూడదు. ఈ షరతు చూసి షాకయ్యారా? డోన్ట్ వర్రీ.. ఈ నిబంధన వినియోగదారులకు కాదు, రాజకీయ పార్టీల కోసం. ఎన్నికల సీజన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ కొత్త నిబంధన తెస్తోంది.
Samayam Telugu Untitled12


ఈ మేరకు ఈసీఐ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేసింది. ఇప్పటికే రాత్రి 10 గంటలు దాటితే ఎక్కడా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. ఈసీఐ జారీ చేసిన తాజా సూచనల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి.. ఇంటింటి ప్రచారం, ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఫోన్ కాల్స్‌కు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది.

ప్రజల వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లకుండా గౌరవించడం తప్పనిసరని, రాత్రి 10 తర్వాత వారికి అభ్యర్థుల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఈసీఐ ఈ సందర్భంగా పేర్కొంది. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ లేదా పాలిథిన్ వస్తువులను వినియోగించరాదని, అనుమతి లేకుండా ఎక్కడపడితే అక్కడ బ్యానర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంపై పరిమితులు విధిస్తున్నామని వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.