యాప్నగరం

కుప్పకూలిన రెండు భవనాలు.. ముగ్గురు మృతి, శిథిలాల కింద మరో 30మంది

నోయిడాలో రెండు భవనాలు కుప్పకూలాయి. రాత్రి సమయంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల మరో భవనంపై పడిపోయింది. అందరూ చూస్తుండగానే క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగిపోగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు ప్రారంభించాయి.

Samayam Telugu 18 Jul 2018, 11:10 am
నోయిడాలో రెండు భవనాలు కుప్పకూలాయి. రాత్రి సమయంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి.. పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల మరో భవనంపై పడిపోయింది. అందరూ చూస్తుండగానే క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగిపోగా.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యలు ప్రారంభించాయి. నాలుగు అంతస్తుల భవనంలో 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దీంతో శిథిలాల కింద కొంతమంది చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 3 మృతదేహాలను బయటకు తీయగా.. గాయపడిన 50మందిని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu Building


శిథిలాల కింద 30మంది వరకు చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శిథిలాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. ఘటన గురించి తెలియగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అలర్ట్ అయ్యారు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌ను ఆరా తీశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేసి.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు కూలిన భవనానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.