యాప్నగరం

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపు

కాల్ చేసిన వ్యక్తిని నొయిడా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడ్ని అరెస్ట్ చేసి విచారించారు. అయితే డ్రగ్స్‌కు బానిసైన అతడు.. మానసిక పరిస్థితి సరిగా లేదని అధికారులు గుర్తించారు.

Samayam Telugu 11 Aug 2020, 8:13 am
ప్రధాని మోదీకి హాని తలపెడతానంటూ 100కు ఓ ఫోన్కాల్ వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు వివరాల్లోకి వెళ్తే.. హర్యానా రాష్ట్రానికి చెందిన హర్‌భజన్ సింగ్ నోయిడా నగరంలో నివాసముంటున్నారు. సింగ్ డ్రగ్స్‌కు బానిసగా మారాడు. సోమవారం హర్‌భజన్ సింగ్ 100 పోలీసు ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్ చేసి ప్రధాని మోదీకే హాని తలపెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నోయిడా ఫేజ్ 3 పోలీసులు నిందితుడైన హర్‌భజన్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అతడ్ని పట్టుకొని ప్రశ్నిస్తున్నారు.
Samayam Telugu ప్రధాని మోదీ
pm modi


ప్రధానిని బెదిరించిన హర్‌భజన్ సింగ్ డ్రగ్ ఎడిక్టు అని, అతన్ని ప్రశ్నించి వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించామని నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ చెప్పారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీని ఫోన్ లో బెదిరించిన యువకుడి ఘటన నోయిడాలో సంచలనం రేపింది. డ్రగ్స్‌కు బానిసన హర్భజన్ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తోంది. అందుకే అతడు ఆ విధంగా ఫోన్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రశ్నించే క్రమంలో సింగ్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. ఈ విషయాన్ని స్వయంగా నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.