యాప్నగరం

కావేరీ నీటిని వదలలేం : కర్ణాటక సీఎం

కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. 

TNN 29 Sep 2016, 12:44 pm
కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు మధ్య చిచ్చుపెట్టింది. సుప్రీం కోర్టు కావేరీ జలాలు తమిళనాడుకు వదలాల్సిందేనని ఆదేశించినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఇప్పటి పరిస్థితుల్లో నీరు వదలలేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మళ్లీ తెలిపారు. బుధవారం రాత్రి బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన తాము నీళ్లు వదిలే పరిస్థితుల్లో లేమని అన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం చెబుతామన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు, కర్ణాటక సీఎంలతో కేంద్రం మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని భావిస్తోంది. ఆ సమావేశానికి సంబంధించిన నివేదికను శుక్రవారం సాయంత్రం కల్లా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయబోతోంది.
Samayam Telugu not in a position to release cauvery water says siddaramaiah
కావేరీ నీటిని వదలలేం : కర్ణాటక సీఎం


సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో ఈ నెల 30 వరకు మూడు రోజుల పాటూ రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీళ్లు విడుదల చేయాలని ఆదేశించింది. దానిని కర్ణాటక పాటించలేదు. అత్యున్నత ధర్మాసనం తీర్పును పాటించకుండా, వేరే రాష్ట్రంతో తగాదా పెట్టుకునే హక్కు ఏ రాష్ట్రానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది కూడా. అయినా కర్ణాటక ప్రభుత్వం నీళ్లు విడుదల చేయలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.