యాప్నగరం

పాఠ్యపుస్తకాల్లో ‘నోట్ల రద్దు’ అంశం!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ‘నోట్ల రద్దు’ ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కనుంది.

TNN 24 Jan 2017, 12:16 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ‘నోట్ల రద్దు’ ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కనుంది. ఈ మేరకు నోట్ల రద్దు (డీమానిటైజేషన్), నగదురహిత ఆర్థిక వ్యవస్థ (క్యాష్‌లెస్ ఎకానమీ) అంశాలను 12వ తరగతి పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (RBSE) నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు చాప్టర్లను 12వ తరగతి పాఠ్యపుస్తకాల్లో చేర్చనున్నారు.
Samayam Telugu note ban makes it to rajasthan school syllabus
పాఠ్యపుస్తకాల్లో ‘నోట్ల రద్దు’ అంశం!


నగదురహిత వ్యవస్థ, మొబైల్ వాలెట్ స్ట్రక్చర్ గురించి విద్యార్థులకు బోధిస్తామని ఆర్‌బీఎస్‌ఈ చైర్మన్ బీఎల్ చౌదరి వెల్లడించారు. అయితే సిలబస్‌లో డీమానిటైజేషన్ అంశాన్ని చేర్చినట్లయితే దాని వల్ల కలిగే లాభనష్టాల గురించి చెప్పాలని నిపుణులు అంటున్నారు. దీని గురించి సమగ్రంగా వివరిస్తేనే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని, డీమానిటైజేషన్ వల్ల కలిగే లాభనష్టాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించాలని వారు అభిప్రాయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.