యాప్నగరం

దేశమంతటా NRC.. అమిత్ షా కీలక ప్రకటన

అసోంలో చేపట్టినట్టుగానే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. మతాన్ని వివక్ష చూపబోమన్న ఆయన.. అసోంలోనూ ఎన్ఆర్సీపీ చేపడతామన్నారు.

Samayam Telugu 20 Nov 2019, 5:50 pm
దేశమంతటా ఎన్ఆర్సీసీ నిర్వహిస్తామని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బుధవారం రాజ్య సభలో మాట్లాడిన ఆయన.. మతాన్ని బట్టి వివక్ష చూపడం అనేది ఉండదన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్‌లలో వేధింపులకు గురై.. తలదాచుకోవడం కోసం భారత్ వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలకు భారత పౌరసత్వం కల్పిస్తామన్నారు. దేశమంతటా నేషన్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) చేపడతామని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ఏ మతస్థులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
Samayam Telugu amit shah ls


అన్ని మతాలకు చెందిన భారత పౌరులకు ఎన్ఆర్సీ జాబితాలో చోటు కల్పిస్తామని అమిత్ షా తెలిపారు. ఎలాంటి వివక్ష ప్రదర్శించబోమన్నారు. ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ బిల్లు రెండు వేర్వేరన్నారు. సుప్రీం కోరు ఆదేశాల మేరకు అసోంలో ఎన్ఆర్సీని చేపట్టారని చెప్పిన అమిత్ షా.. ఎన్ఆర్సీని దేశమంతా చేపట్టే సమయంలో.. అసోంలోనూ నిర్వహిస్తామన్నారు.

అసోం వ్యాప్తంగా ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని.. ఎన్ఆర్సీ జాబితాలో పేరు లేని వారు ట్రైబ్యునల్‌కు వెళ్లే హక్కు ఉందని హోం మంత్రి తెలిపారు. ట్రైబ్యునల్‌కు వెళ్లే ఆర్థిక స్థోమత లేని వారికి అసోం ప్రభుత్వమే లాయర్‌ ఫీజులకు అయ్యే ఖర్చులను భరిస్తుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.