యాప్నగరం

ఆయన రాకకోసం సీఎం విమానాన్ని నెట్టేశారు

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు మొన్న శనివారం ఓ వింత అనుభవం ఎదురైంది.

Samayam Telugu 12 Dec 2016, 10:55 am
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు మొన్న శనివారం ఓ వింత అనుభవం ఎదురైంది. ఆ రోజు ఉదయం 11.40కి ఉప రాష్ట్రపతి హమీద్ అన్నారీ రుర్కెలా ఎయిర్ పోర్టులో దిగనున్నారు. ఆయనకు స్వాగతం పలకడానికి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్ నుంచి రుర్కెలా బయలుదేరారు.
Samayam Telugu odisha cms plane pushed manually for vice presidents landing
ఆయన రాకకోసం సీఎం విమానాన్ని నెట్టేశారు


ఉదయం 11.15 గంటలకే నవీన్ పట్నాయక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే మరికాపేసట్లో నవీన్..ఎయిర్ క్రాఫ్ట్ ఆగిన స్థలం బే-1లోనే ఉప రాష్ట్రపతి విమానం ఆగాల్సి ఉంది. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులకు ఏం చేయాలో తెలియడం లేదు. నవీన్..ఎయిర్ క్రాప్ట్ ను పక్కకు తీసుకెళ్లడానికి మరో వాహనం (టోయింగ్ వెహికల్) అందుబాటులో లేదు. పైలట్..కో పైలెట్లు సైతం వెంటనే దిగిపోయారు. దీంతో చేసేది లేక..అందుబాటులో ఉన్న ఎయిర్ పోర్టు సిబ్బందితో...నవీన్ ప్రయాణించిన ఎయిర్ క్రాప్ట్ ను పక్కను తోయాల్సి వచ్చింది. హమీద్ అన్నారి రాకకు మరో ఐదు నిమిషాలే ఉండటంతో ఇలా చేయాల్సి వచ్చిందని సీఐఎస్ఎఫ్ సభ్యుడొకరు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.