యాప్నగరం

కరోనా ఎఫెక్ట్ .... లాక్ డౌన్ దిశగా మరో రాష్ట్రం

రేపట్నుంచి ఈనెల 29వరకు లాక్ డౌన్. అత్యవసర సేవలకు మినహాయింపు. రాష్ట్రంలో 40 శాతం మూతపడినట్లే. మరోవైపు మహరాష్ట్రలో లాక్ డౌన్ చేసే అవకాశం.

Samayam Telugu 22 Mar 2020, 2:33 pm
కోవిడ్19 వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఆదివారం మార్చి22న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తుంటే వరుసగా రాష్ట్రాలు లాక్ డౌన్ సైతం ప్రకటిస్తున్నాయి. తాజాగా ఒడిషా రేపట్నుంచి ఈనెల 29వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఐదు జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుందిి. ఖుర్దా, కటక్, గంజాం, కేంద్రపారా, అంగుల్ జిల్లాలో అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటిన్నింటిని మూసివేస్తున్నట్లు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఇప్పటికే కొన్ని పట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటించగా ఆదివారం మార్చి 22 నుంచి మరి కొన్నిపట్టణాల్లో లాక్ డౌన్ ప్రకటిస్తోంది ఒడిషా.
Samayam Telugu 138696-grrkdwaukl-1584848273


వారం క్రితమే ఒడిషాలోని భువనేశ్వర్, కటక్ వంటి పారిశ్రామిక ప్రాంతాలు మూతపడ్డాయి. పూరీ, రూర్కేలా, సంబల్‌పూర్‌, జార్షూగూడ, బాలాసోర్‌, జాజ్‌పూర్‌ రోడ్‌, జాజ్‌పూర్‌ టౌన్‌, భద్రక్‌ పట్టణాల్లో ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేసింది. అత్యవరస సేవలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయించారు. దీంతో మొత్తం రాష్ట్రంలో 40 శాతం మూతపడినట్లైంది. మరోవైపు పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు సరిహద్దుల్ని సీల్ చేశాయి.

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో 300 దాటింది. మరోవైపు ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. జనతా కర్ఫ్యూ పాటించిన రోజే.. మహారాష్ట్ర, బీహార్‌లో కరోన వైరస్‌తో చికిత్స పొందుతున్న ఇద్దరు పేషంట్లు చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర కూడా లాక్ డౌన్ దిశగా ఆలోచనలు చేస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.