యాప్నగరం

పేకాటలో భార్యనే తాకట్టు.. మిత్రుడికి అప్పగించి దగ్గరుండి రేప్!

మహాభారతంలోనే కాదు.. కలియుగంలోనూ భార్యను జూదంలో పందెం కాసే భర్తలు ఉన్నారు. అక్కడ ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెడితే.. ఇక్కడ భర్త తన భార్య శీలాన్ని తాకట్టు పెట్టేశాడు.

Samayam Telugu 31 May 2018, 2:03 pm
మహాభారతంలోనే కాదు.. కలియుగంలోనూ భార్యను జూదంలో పందెం కాసే భర్తలు ఉన్నారు. అక్కడ ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెడితే.. ఇక్కడ భర్త తన భార్య శీలాన్ని తాకట్టు పెట్టేశాడు. ఒడిశాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది. బాలాసోర్ జిల్లా బలికూట్‌కు చెందిన వ్యక్తికి పేకాట అంటే పిచ్చి. వారం క్రితం కూడా తన స్నేహితులతో కలిసి జూదం ఆడగా.. డబ్బంతా పోయింది. చివరికి చేతిలో నయా పైసా లేకపోవడంతో భార్యనే తాకట్టు పెట్టాడు. ఆమెపై కన్నేసిన అతడి భర్త స్నేహితుడే ఆటలో గెలిచాడు. వెంటనే ఆమెను తీసుకెళ్లి.. తన ఇంట్లో అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
Samayam Telugu Rape


భర్త స్నేహితుడే చెరబట్టడంతో బాధితురాలు షాకయ్యింది. భయంతో వణికిపోయిన ఆమె.. అతడ్ని తీవ్రంగా ప్రతిఘటించింది. అక్కడే ఉన్న భర్త కనీసం కాపాడే ప్రయత్నం చేయకపోగా.. ఆమెను మంచానికి కట్టేసి స్నేహితుడకి సహకరించాడు. అతడు బాధితురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. మే 23న ఈ ఘటన జరిగింది. జరిగిన విషయాన్ని బయటకు చెబితే పరువు పోతుందని భావించి ఆమె ఎవరికి చెప్పకుండా.. తనలో తను కుమిలిపోయింది. కాని జరిగిన ఘోరం ఆమెను తీవ్రంగా కలిచివేయడంతో మనసు మార్చుకుంది.

బుధవారం రోజు బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. జరిగిన ఘోరాన్ని చెప్పి.. ఫిర్యాదు చేసింది. తన భర్తకు మద్యం అలవాటుందని.. ఇలా ఇంత దారుణానికి సహకరిస్తాడని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.