యాప్నగరం

బెంగళూరు: మహిళతో క్యాబ్ డ్రైవర్ వెకిలి చేష్టలు

ఓలా క్యాబ్ డ్రైవర్ రెచ్చిపోయాడు. కారెక్కిన మహిళపట్ల నీచంగా ప్రవర్తిస్తూ.. వెకిలి చేష్టలతో పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

Samayam Telugu 27 Aug 2018, 12:33 pm
ఓలా క్యాబ్ డ్రైవర్ రెచ్చిపోయాడు. కారెక్కిన మహిళపట్ల నీచంగా ప్రవర్తిస్తూ.. వెకిలి చేష్టలతో పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. బాధితురాలు చెబుతున్న వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6.28 నిమిషాల ప్రాంతంలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని యెలహంక న్యూ టౌన్ నుంచి జేపీ నగర్ వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకొని.. ఆ కారు ఎక్కేసింది.
Samayam Telugu Cab


క్యాబ్ సరిగ్గా క్వీన్స్ సర్కిల్ దగ్గరకు రాగానే డ్రైవర్ మహిళను అదో రకంగా చూశాడట. అతడి చేష్టలతో అప్పటికే ఆమెకు అనుమానం కలిగింది. తర్వాత కారు కొద్ది దూరం వెళ్లగానే డ్రైవర్ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. తన దగ్గరున్న ఫోన్‌లో పోర్న్ వీడియో ప్లే చేశాడు. అంతటితో ఆగకుండా జిప్ తీసి నీచంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలతో షాకైన ఆ మహిళకు ఏం చేయాలో కూడా అర్థంకాలేదు. కారు ఆపమని పెద్దగా కేకలు వేసినా అతడు పట్టించుకోలేదు. చివరికి కారును తీసుకెళ్లి జేపీ నగర్‌లో ఆపేశాడు. భయంతో ఆమె కారు దిగి పరిగెత్తిందిట.

శనివారం ఘటనపై బాధితురాలు కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాబ్ వివరాలను వారికి అందించడంతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఆ డ్రైవర్‌ను దేవసమోలియాగా గుర్తించారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనపై ఓలా సంస్థ ప్రతినిధి స్పందించారు. ఓలా వినియోగదారులే తమకు చాలా ముఖ్యమని.. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని.. తాము పోలీసులకు సహకరిస్తామంటున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.