యాప్నగరం

విపక్షాలు 2019 గురించి మరచిపోవాలంటున్న ఒమర్

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సునామీ సృష్టించడంతో పలువురు నేతలు మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

TNN 11 Mar 2017, 1:09 pm
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సునామీ సృష్టించడంతో పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఒమర్ అబ్దుల్లా ప్రధానిని కొనియాడుతూ ట్వీటర్‌లో పోస్టు చేశారు. ఇవి చిన్న చెరువులో అలలు కావు, ఇదో సునామీ అని ఆయన అభివర్ణించారు.
Samayam Telugu omar abdullah praises modi on twitter
విపక్షాలు 2019 గురించి మరచిపోవాలంటున్న ఒమర్


మోడీకి తిరుగులేదనీ, ప్రస్తుతం ఆయణ్ని సవాలు చేసే జాతీయ నేత ఎవరూ లేరని ఆయన వ్యాఖ్యానించారు. 2019లో బీజేపీకి ఏ పార్టీ పోటీ ఇవ్వలేదని అబ్దుల్లా జోస్యం చెప్పారు. 2019 ఎలక్షన్ల గురించి మరిచిపోయి.. 2024 గురించి ప్రణాళికలు వేసుకోవాలని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు.
In a nutshell there is no leader today with a pan India acceptability who can take on Modi & the BJP in 2019. — Omar Abdullah (@abdullah_omar) March 11, 2017
At this rate we might as well forget 2019 & start planning/hoping for 2024. — Omar Abdullah (@abdullah_omar) March 11, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.