యాప్నగరం

రేపు తేలనున్న చిన్నమ్మ భవితవ్యం!

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ భవితవ్యం మంగళవారం తేలనుంది.

TNN 13 Feb 2017, 7:40 pm
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ భవితవ్యం మంగళవారం తేలనుంది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, శశికళ అక్రమాస్తుల కేసులో రేపు సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో శశికళ ఏ-2 నిందితురాలుగా ఉన్నారు. ఓవైపు తమినాడు అసెంబ్లీలో గవర్నర్ విద్యాసాగర్‌రావు బలపరీక్షకు పిలిచే అవకాశమున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Samayam Telugu ops vs sasikala supreme court will deliver judgment on sasikala case on tuesday at 10 30 am
రేపు తేలనున్న చిన్నమ్మ భవితవ్యం!


జస్టిస్ పి.సి. ఘోష్, జస్టిస్ అమితవ రాయ్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ రేపు ఉదయం 10.30 గంటలకు శశికళ కేసులో తీర్పు వెలువరించనుంది. ఇద్దరు న్యాయమూర్తులు వేరు వేరుగా తీర్పులు వెలువరించనున్నారు. దీంతో శశికళ వర్గం కొంత ఆందోళనకు గురవుతోంది. మరోవైపు అసెంబ్లీలో పన్నీర్ సెల్వం, శశికళ మధ్య బలపరీక్ష నిర్వహిస్తే తాము కూడా పాల్గొంటామని డీఎంకే నేత స్టాలిన్ స్పష్టం చేసారు. అయితే సుప్రీం కోర్టు తీర్పుపై ఇప్పుడు స్పందించాడని ఆయన నిరాకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.