యాప్నగరం

4 గంటల్లో 2 సార్లు రాహుల్ గాంధీ అరెస్టు

మాజీ సైనికుడి ఆత్మహత్య ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

TNN 2 Nov 2016, 8:02 pm
మాజీ సైనికుడి ఆత్మహత్య ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అమలు చేయడంలో జాప్యం జరగడంతో హర్యానాకు చెందిన మాజీ సైనికుడు రామ్ కిషన్ గ్రేవాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. మొదట మధ్యాహ్నం సమయంలో ఆయన ఆసుపత్రిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అక్కడ నుంచి తిక్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపు నిర్భంధంలో ఉంచి అనంతరం విడుదల చేశారు. సాయంత్రం మళ్లీ రాహుల్ ఆసుపత్రికి వెళ్లగా అతడిని అరెస్టు చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేవలం నాలుగ్గంటల సమయంలోనే రాహుల్ రెండు సార్లు అరెస్టుకు గురయ్యారు.
Samayam Telugu orop issue rahul detained twice in 4 hours
4 గంటల్లో 2 సార్లు రాహుల్ గాంధీ అరెస్టు


మరో వైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాను పోలీసులు ఆసుపత్రిలోకి అనుమతించలేదు. కాసేపు అదుపులోకి తీసుకుని నిర్భంధించారు. అలాగే జ్యోతిరాదిత్య సింథియా, అజయ్ మాకెన్ లు కూడా ఆసుపత్రిలోకి వెళ్లేందుకు విఫల ప్రయత్నం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.