యాప్నగరం

సిక్కింలో బస్సు బోల్తా... 22 మంది విద్యార్థులకు గాయాలు

పర్యటనకు వెళ్లిన విద్యార్థుల బస్సు సిక్కింలో ప్రమాదానికి గురైంది. గ్యాంగ్ టక్‌లో బోల్తా పడింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ 22 మంది విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థులు తిరిగి రాంచీకి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ విషయంపై సిక్కిం సీఎం స్పందించారు. పిల్లలకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 28 Jun 2022, 5:48 pm
కాలేజీ విద్యార్థులు ప్రయాణిస్తోన్న బస్సు సిక్కింలో గ్యాంగ్ టక్‌‌లో బోల్తా పడింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ప్రమాదంలో జార్కండ్ రాంచీలోని సెయింట్ జేవియర్ కాలేజీకి చెందిన 22 మంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థులు సిక్కిం విహార యాత్రకు వెళ్లారు. వారు పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి రాంచీకి తిరిగి వస్తుండగా రాణిపూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడో మైలు వద్ద వారి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
Samayam Telugu సిక్కింలో బస్సు బోల్తా... 22 మంది విద్యార్థులకు గాయాలు



ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను టాడాంగ్‌లోని సెంట్రల్ రిఫరల్ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. అక్కడ వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్‌తో మాట్లాడినట్టు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు. " విద్యార్థులు పర్యటనకు వెళ్లిన బస్సుకు ప్రమాదం జరిగినట్టు ఇప్పుడే తెలిసింది. నేను సిక్కిం సిఎంతో మాట్లాడాను. పిల్లల వైద్యం కోసం తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిల్లలను విమానంలో తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్సీని ఆదేశించాను. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రస్తుతం అది చేయలేం. కాబట్టి విద్యార్థులకు మంచి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం." అని జార్ఖండ్ ముఖ్యమంత్రి ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.