యాప్నగరం

శానిటైజర్లు అతిగా వాడుతున్నారా? ప్రభుత్వం తాజా హెచ్చరిక ఏంటంటే..

Coronavirus in India: ‘‘ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎవరూ ఊహించనివి. ఒక వైరస్ మానవాళిపై ఇంతలా విరుచుకుపడుతుందని ఏనాడూ అనుకోలేదు. ఎవరికివారు తమను తాము రక్షించుకోవడం కోసం తప్పకుండా ముఖానికి మాస్కు ధరించండి.’’ అని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Samayam Telugu 25 Jul 2020, 10:28 pm
కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా శానిటైజర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. అంతకుముందు శానిటైజర్ అంటే ఏంటో తెలియని వారు కూడా వైరస్ ప్రబలడం మొదలైనప్పటి నుంచి తరచూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంటున్నారు. శుభ్రత పాటించడం మంచి అలవాటే అయినా మరీ మితిమీరిన శానిటైజర్ల వాడకం మాత్రం మంచిది కాదని తాజాగా ఆరోగ్యమంత్రిత్వశాఖ హెచ్చరించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
sanitizer


కరోనా వైరస్ విపత్తు వేళ శానిటైజర్‌ను ఎక్కువగా వాడడం అంత మంచిది కాదని వైద్యారోగ్య మంత్రిత్వశాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్ ఆర్‌కే వర్మ అన్నారు. దాని బదులుగా ఎక్కువ సార్లు చేతులను సబ్బుతో కడుక్కోవడం శ్రేయస్కరమని సూచించారు. శానిటైజర్లు అధికంగా వాడడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే మంచి బ్యాక్టీరియాను కూడా నశిస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.

‘‘ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఎవరూ ఊహించనివి. ఒక వైరస్ మానవాళిపై ఇంతలా విరుచుకుపడుతుందని ఏనాడూ అనుకోలేదు. ఎవరికివారు తమను తాము రక్షించుకోవడం కోసం తప్పకుండా ముఖానికి మాస్కు ధరించండి. తరచూ వేడి నీటినే తాగండి. చేతులను సబ్బుతోనే శుభ్రం చేసుకోండి. కానీ, శానిటైజర్లను మాత్రం అతిగా వాడకండి’’ అని డాక్టర్ ఆర్‌కే వర్మ సూచించారు.
Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.