యాప్నగరం

రాజ్యసభకు ఇళయరాజా, పీటీ ఉష, రాజమౌళి తండ్రిని నామినేట్ చేసిన కేంద్రం

Rajya Sabha Nominated Posts: ఇళయరాజా, పీటీ ఉష, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నలుగురు ప్రముఖులూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖులే కావడం గమనార్హం. వీరిలో ఇద్దరు కళలు, ఒకరు క్రీడల రంగానికి చెందిన వారు కాగా.. మరొకరు ఆధ్యాత్మిక, సామాజిక సేవా రంగానికి చెందిన వారు. వీరికి అభినందనలు తెలుపుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 6 Jul 2022, 9:05 pm
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉష, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం వీరిని రాజ్యసభకు నామినేట్ చేసింది. వీరితో పాటు వీరేంద్ర హెగ్డేను కలిపి మొత్తం నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో వీరిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ నలుగురు ప్రముఖులూ దక్షిణాదికి చెందిన వారే కావడం విశేషం. కళలు, సామాజిక-సేవతో పాటు వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసే వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది.
Samayam Telugu రాజ్యసభకు ఇళయరాజా, పీటీ ఉష, విజయేంద్ర ప్రసాద్
Rajya Sabha nominated posts


ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ నలుగురు ప్రముఖులకు ఫోన్ చేసి రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని చెప్పి అభినందనలు తెలిపారు. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. వీరికి అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

ఇళయరాజా సంగీతం అనేక భావాలకు ప్రతిబింబమని.. అనేక తరాలకు అదో వారధిలా నిలిచిందని ప్రధాని మోదీ కొనియాడారు. పీటీ ఉష జీవితం ప్రతి భారతీయుడికీ ఆదర్శనీయం అన్నారు. ఏళ్లుగా ఆమె ఎందరో క్రీడాకారుల్ని తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా సృజనాత్మక రంగంలో సేవలు అందిస్తున్నారని.. ఆయన సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయని కొనియాడారు.

వీరేంద్ర హెగ్డే సామాజిక సేవతో విశేష గుర్తింపు పొందారు. విద్య, ఆరోగ్యం, సంస్కృతి రంగాల్లో కర్ణాటకలో సేవలు అందిస్తున్నారు. ‘ధర్మస్థల ఆలయాన్ని సందర్శించాను. అక్కడ వీరేంద్ర హెగ్డే గొప్ప సేవా కార్యక్రమాలను స్వయంగా వీక్షించాను’ అని మోదీ ట్వీట్ చేశారు.




రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.