యాప్నగరం

జాదవ్ కుటుంబం పట్ల పాక్ తీరుపై సుష్మా ఆవేదన

తమ దేశంలో ఉగ్రవాదానికి, గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో భారత నౌకదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ అరెస్ట్ చేసి, మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే.

TNN 28 Dec 2017, 1:28 pm
జైళ్లో ఉన్న కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కలుసుకోడానికి వెళ్లిన అతడి కుటుంబ సభ్యులు పట్ల పాకిస్థాన్ అమానుషంగా ప్రవర్తించిందని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పార్లమెంటులో ఓ ప్రకటన చేస్తూ.. జాదవ్‌ను కలవడానికి వెళ్లిన తల్లి, భార్య మెడలో మంగళసూత్రాన్ని బలవంతంగా తీయించి అవమానించారని సుష్మా మండిపడ్డారు. మంగళసూత్రం, కాలి మట్టెలు, గాజులు తీయించి భారతీయుల మనోభావాలను కించపరిచారని ఆరోపించారు. తనను చూసిన వెంటనే నాన్న ఎలా ఉన్నారని కుల్‌భూషణ్ అడిగితే, నీకు ఎమవుతుందోననే బాధతో తల్లడిల్లిపోతున్నారని తల్లి అవంతీ జాదవ్ తెలిపినట్లు సుష్మా పేర్కొన్నారు.
Samayam Telugu pak used jadhav family reunion as propaganda tool says sushma swaraj
జాదవ్ కుటుంబం పట్ల పాక్ తీరుపై సుష్మా ఆవేదన


22 నెలల తర్వాత తన కొడుకును తల్లి, భర్తను భార్య కలుసుకునే భావోద్వేగ సన్నివేశంలో పాక్ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని... ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనేనని సుష్మా దుయ్యబట్టారు. వారికి ఏమాత్రం మానవత్వం లేదు... వారి అనాగరిక ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నానని ఉద్వేగానికి గురయ్యారు. భద్రతను సాకుగా చూపి జాదవ్ తల్లి, భార్యలతో పాకిస్థానీ దుస్తులను బలవంతంగా ధరింపజేశారని, అవంతిక జాదవ్ కేవలం చీరలను మాత్రమే ధరిస్తారని, ఆమెతోనూ సల్వార్ కమీజ్ వేయించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మంగళసూత్రాన్ని తీయబోమని, ఇది తమ వివాహానికి చిహ్నమని పాక్ అధికారులకు అవంతీ జాదవ్ తెలిపినా వారు మూర్ఖంగా వ్యవహరించారని సుష్మా ఆగ్రహించారు. ​ భద్రతా కారణాల దృష్ట్యా చెప్పులు తీసుకుని ఉండి ఉంటే తిరిగి వెళ్లేప్పుడు ఇచ్చేయాలని.. కానీ పాక్‌ అలా చేయకుండా క్రూరంగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు

అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు, భారత్ అభ్యర్థనల్ని అనేకసార్లు ఒత్తిడి తేవడంతో చివరకు జాదవ్‌ను కలిసేందుకు తల్లి, అతడి భార్యకు పాకిస్థాన్ అనుమతి ఇచ్చింది. దీంతో డిసెంబర్ 25 న కుటుంబ సభ్యులు జాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐ చెప్పిన విధంగానే జాదవ్ మాట్లాడాడు. పాకిస్థాన్‌ కుట్రను పసిగట్టిన జాదవ్ తల్లి ఇరాన్‌లో వ్యాపారం చేస్తున్న నిన్ను పాకిస్థాన్ సైన్యం ఎత్తుకొచ్చింది కదా. నువ్వు నిజం చెప్పాలి అంటూ 70 ఏళ్ల అవంతి జాదవ్ కొడుకు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.