యాప్నగరం

చర్చలకు పాక్ రెడీ, త్వరలో లేఖ: అజీజ్

కాశ్మీర్ అంశంపై భారత్‌తో చర్చించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాల సలహాదారు సత్రాజ్ అజీజ్ అన్నారు.

TNN 12 Aug 2016, 4:16 pm
కాశ్మీర్ అంశంపై భారత్‌తో చర్చించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాల సలహాదారు సత్రాజ్ అజీజ్ అన్నారు. ఈ అంశంపై చర్చలకు భారత్‌ను అహ్వానిస్తూ పాక్ త్వరలో లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. ‘జమ్మూ, కాశ్మీర్ అంశంపై చర్చించేందుకు రావాల్సిందిగా తమ విదేశీ వ్యవహారాల కార్యదర్శి భారత్‌కు లేఖరాయనునట్లు’ అజీజ్ శుక్రవారం వెల్లడించారు. అయితే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండురోజుల క్రితం పార్లమెంటులో మాట్లాడుతూ పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిపితే కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపైనే జరుపుతుందని స్పష్టం చేశారు. జమ్మూ, కాశ్మీర్ అంశాలపై చర్చించే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో ఇటీవల చెలరేగిన హింసకు పాకిస్థానే కారణమని ఆయన విమర్శించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.