యాప్నగరం

కుల్‌భూషణ్‌ కుటుంబీకులకు పాక్ గుడ్ న్యూస్

దేశద్రోహం ఆరోపణలపై పాకిస్థాన్‌‌ జైల్లో జీవితం గడుపుతున్న ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ ఉదంతంలో ఊరట కలిగించే వార్త. జాదవ్‌ను చూడటానికి పాక్ ప్రభుత్వం అతడి తల్లి, భార్యను అనుమతించింది.

TNN 8 Dec 2017, 3:16 pm
దేశద్రోహం ఆరోపణలపై పాకిస్థాన్‌‌ జైల్లో జీవితం గడుపుతున్న ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ ఉదంతంలో ఊరట కలిగించే వార్త. జాదవ్‌ను చూడటానికి పాక్ ప్రభుత్వం అతడి తల్లి, భార్యను అనుమతించింది. డిసెంబర్ 25న వీరిరువురికీ జాదవ్‌తో జైల్లో ములాఖత్ ఏర్పాటు చేస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ తెలిపారు. వారాంతపు ప్రెస్‌మీట్ సందర్భంగా.. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ విషయం తెలిపారు.
Samayam Telugu pakistan allows kulbhushan jadhav to meet wife mother on december 25
కుల్‌భూషణ్‌ కుటుంబీకులకు పాక్ గుడ్ న్యూస్


నిజానికి జాదవ్‌ను చూడటానికి అతడి భార్యకు అనుమతిస్తామంటూ నవంబర్ 10నే పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. ఆయన తల్లికి కూడా అనుమతి కల్పించాలని భారత్‌ కోరగా దాన్ని మన్నించలేదు. మానవతా దృక్పథంతో భార్యను మాత్రమే అనుమతిస్తామని ఫైజల్‌ తెలిపారు. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం తాజాగా ఆయన తల్లికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.

తీవ్రవాదం, దేశద్రోహం ఆరోపణలతో జాదవ్‌కు పాక్‌ సైనిక కోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. జాదవ్ ఉదంతంపై భారత్‌.. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విచారణ పూర్తయ్యే వరకు శిక్షను నిలిపేయాలని మేలో పాక్‌ను ఆదేశించింది. స్పందించడానికి డిసెంబరు 13 వరకు గడువు ఇచ్చింది. జాదవ్‌ను విడిపించడానికి భారత ప్రభుత్వం.. అంతర్జాతీయంగా పాక్‌పై ఒత్తిడి తీసుకొస్తూ.. వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

Also Read: కుల్‌భూషణ్ మరణశిక్షపై స్టే విధింపు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.