యాప్నగరం

బర్మేర్ సరిహద్దుల్లో పాక్ గూఢచారి అరెస్ట్.. అప్రమత్తమైన సైన్యం

కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని భారత్ రద్దుచేయడంతో లోయలో శాంతికి విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.

Samayam Telugu 13 Sep 2019, 3:28 pm
దేశంలోకి చొరబడిన పాకిస్థాన్ గూఢచారిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకుంది. బర్మేర్‌లోని భారత్-పాక్ సరిహద్దులో అక్రమంగా చొరబడిన వ్యక్తిని పట్టుకున్న సైన్యం.. విచారణలో అతడిని పాక్ గూఢచారిగా గుర్తించారు. సరిహద్దులో బారికేడ్ల కింది నుంచి పాకుకుంటూ లోనికి చొరబడి ఉంటాడని సిబ్బంది భావిస్తున్నారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్, ఆర్మీల గురించి సమాచారం తెలుసుకోవడాని తన మేనమామ పంపినట్టు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. అతడి పేరును కిశోర్‌గా పేర్కొంటున్నారు. కిశోర్‌ను తదుపరి విచారణ కోసం జైపూర్ తరలించారు.
Samayam Telugu pak


సరిహద్దుల్లో చొరబాటుకు పాక్‌ ఆర్మీ కూడా అతడికి సాయం చేసినట్లు బీఎస్‌ఎఫ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్థాన్‌లోని ఖొఖ్రాపర్‌ వరకు రైలులో వచ్చిన గూఢచారి.. అక్కడి నుంచి పాక్‌ ఆర్మీ సాయంతో సరిహద్దు దాటినట్లు విచారణలో వెల్లడించాడు. అయితే మూడు రోజుల పాటు విచారించినా అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తదుపరి విచారణ నిమిత్తం జైపూర్‌కు తరలించారు. బర్మేర్‌ వద్ద దేశంలోకి చొరబడ్డ నిందితుడిని తొలుత గ్రామస్థులు పట్టుకుని భద్రతా దళాలకు అప్పగించాయి. సరిహద్దుల్లోని అడవుల్లో భద్రతా సిబ్బంది తన కదలికలను గుర్తించకుండా ఉండేందుకు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించినట్టు సైన్యం తెలిపింది.

సెప్టెంబరు తొలివారంలో కశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ జాతీయులను సైన్యం పట్టుకున్న విషయం తెలిసిందే. దేశంలోకి చొరబడేందుకు 50 మంది లష్కరే తొయిబా ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు విచారణలో ఈ ఇద్దరూ వెల్లడించారు. అంతేకాదు, పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ సాయంతో ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని దర్యాప్తులో వెల్లడించినట్టు సైన్యం పేర్కొంది. ఖలీల్ అహ్మద్, మోజమ్ ఖోకర్‌లు కచర్బన్ పోస్ట్ వద్ద పాక్ ఆర్మీ సాయంతో దేశంలోని చొరబడేందుకు ప్రయత్నించి చిక్కారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.