యాప్నగరం

మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లు

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ... జమ్మూకశ్మీర్‌లోని కృష్ణఘటి సెక్టార్‌లో పాక్ రేంజర్లు ఈ ఉదయం నుంచి కాల్పులకు తెగబడ్డారు.

TNN 3 Apr 2018, 11:54 am
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ... జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా, కృష్ణఘటి సెక్టార్‌లో పాక్ రేంజర్లు ఈ ఉదయం 7 గంటల నుంచి కాల్పులు ప్రారంభించారు. భారత ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మోర్గార్ షెల్స్‌తో దాడికి పాల్పడుతున్నారు. ఈ దాడిని భారత బలగాలు సమర్థమంతంగా తిప్పికొడుతున్నాయి. గతనెలలో పాక్ బలగాల కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించడంతోపాటు, ఇద్దరు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచి పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 12 మంది సైనికులు కూడా ఉన్నారు.
Samayam Telugu pak


ఇదిలా ఉండగా... కశ్మీర్‌లో భారత్‌ నిరంకుశ అణచివేతకు పాల్పడుతోందంటూ పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షాహిద్‌ అబ్బాసీ వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల క్రితం.. భీకర ఎదురుకాల్పులు జరిపి 13 మంది ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పులకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న పౌరులపై పెల్లెట్‌ తుపాకులు ప్రయోగించడం లాంటి నిరంకుశ చర్యలకు భారత్‌ పాల్పడుతోంది. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్‌లో పరిస్థితుల పరిశీలన కోసం ఐక్యరాజ్యసమితి కమిటీని అనుమతించేలా భారత్‌ను అంతర్జాతీయ సమాజం ఒప్పించాలని ఆయన అన్నారు.

మరోవైపు... హింసాత్మక చర్యలకు పాల్పడటంతో పాటు 62 మందిని హత్య చేసిన 10 మంది ఉగ్రవాదులకు పాకిస్థాన్‌లోని ప్రత్యేక సైనిక న్యాయస్థానాలు మరణ దండన విధించాయి. ఈ శిక్షలకు ఆ దేశ సైన్యాధిపతి జనరల్‌ ఖామర్‌ జావెద్‌ బజ్వా ఆమోదం తెలిపినట్లు ఆర్మీ సమాచార విభాగం వెల్లడించింది. శిక్షలకు గురైన వారిలో 2014లో పెషావర్‌లోని పెర్ల్‌ కాంటినెంటల్‌ హోటల్‌పై దాడిచేసిన ఉగ్రవాదులతో పాటు ప్రసిద్ధ సూఫీ ఖవాలీ రచయిత అమ్జాద్‌ సబ్రీ హంతకులూ ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.