యాప్నగరం

చిన్నారిపై అత్యాచారం, హత్య.. హంతకుడిని ఉరితీసిన పాక్

చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, హత్యచేసిన హంతకుడికి పాకిస్తాన్ కోర్టు ఉరిశిక్ష విధించింది. తీర్పు వెల్లడైన వారంలోనే శిక్ష అమలు చేసింది.

Samayam Telugu 17 Oct 2018, 9:47 pm
డేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమెను దారుణంగా హత్యచేసిన హంతకుడిని పాకిస్తాన్‌లోని లాహోర్ జైల్లో బుధవారం ఉరితీశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇమ్రాన్ అలీ అనే వ్యక్తి లాహోర్‌కు 50 కిమీల దూరంలో ఉన్న కసూర్‌లో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం హత్యచేసి చెత్తకుప్పలో పడేశాడు.
Samayam Telugu hanging-deth-for-child-rape


ఈ ఘటన పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించింది. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో ఇద్దరు మరణించారు కూడా. ఈ కేసు విచారించిన యాంటి టెర్రరిజం కోర్టు ఇమ్రాన్ అలీకి ఉరిశిక్ష విధించింది. అలీపై మరో తొమ్మిది.. అత్యాచారం, హత్య కేసులు కూడా ఉన్నాయి. చిన్నారి తల్లిదండ్రులు హంతకుడిని బహిరంగంగా ఉరి తేయాలనే డిమాండును కోర్టు తిరస్కరించింది. అలాగే, ఉరి శిక్షను లైవ్‌లో ప్రసారం చేయాలనే లాయర్ల డిమాండ్‌కు కూడా కోర్టు ఒప్పుకోలేదు. ఈ ఘటన జనవరి నెలలో చోటుచేసుకోగా, కోర్టు తీర్పు వెల్లడించిన వారం రోజుల్లోనే హంతకుడిని ఉరితీయడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.