యాప్నగరం

జవాన్ల తలనరికి.. వీడియోలు తీస్తున్న పాక్!

పాక్ పైశాచికత్వం.. హద్దులు దాటుతోంది. మన జవాన్లను దారుణంగా చంపడంతో పాటు వాళ్ల తలలు నరికేందుకు అనువైన కత్తులను పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం (BAT)కు అందిస్తోంది.

TNN 24 Jun 2017, 4:31 pm
పాక్ పైశాచికత్వం.. హద్దులు దాటుతోంది. మన జవాన్లను దారుణంగా చంపడంతో పాటు వాళ్ల తలలు నరికేందుకు అనువైన కత్తులను పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం (BAT)కు అందిస్తోంది. ఆ దారుణాలు చిత్రీకరించడం కోసం కెమేరాలు కూడా ఇస్తోంది. జమ్ము కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఎల్ఓసీకి 600 మీటర్ల పరిధిలో పహారాకాస్తున్న భారత సైన్యం లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది.
Samayam Telugu paks bat team carried daggers to mutilate indian jawans and cameras to record terror attacks
జవాన్ల తలనరికి.. వీడియోలు తీస్తున్న పాక్!


ఇటీవల బ్యాట్(BAT) జరిపిన దాడిలో ఇద్దరు భారత సైనికులు మరణించారు. సైన్యం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌కు చెందిన బ్యాట్ సైనికుడి శవం లభించింది. అతడి వద్ద ఒక ఏకే రైఫిల్, 3 మెగజిన్స్, 2 గ్రానైడ్లతో పాటు.. తలలను వేరు చేసేందుకు వాడే పెద్ద బాకు(కత్తి) దొరికింది. అతడి తలకు కెమేరా కూడా అమర్చి ఉంది.

ఈ నేపథ్యంలో.. పాక్ సైన్యాధికారులు మన సైన్యంపై జరిపే దాడులు, జవాన్ల తలలు నరికే వీడియోలను లైవ్‌లో వీక్షిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే, నిజమైతే.. అంతకంటే అరాచకం మరొకటి ఉండదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.